పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన అంత్యక్రియలు 30 జూలై 1899న డార్కింగ్ పట్టణం స్మశానవాటికలో పాక్షికమైన సైనిక లాంఛనాలతో జరిగాయి. "ది క్వీన్స్" అనబడే రెండవ వాలంటీర్ బ్రిగేడ్‌కు చెందిన సైనిక దళం ఒకటి శవయాత్రకు ముందు నడిచి, సమాధి మీదుగా తుపాకులు పేలుసూ, సైనిక వందనం చేసింది. రివరెండ్ జి.పి. క్విక్ ఆఫ్ డగ్లస్, కార్క్ రెవరెండ్ ఎఫ్.ఇ. ఆల్డ్ క్యూరేట్ ఆఫ్ సెయింట్ మేరీస్ డెవోన్స్ పోర్ట్ అంత్యక్రియలకు హాజరైనారు. ఆయన శవపేటికను ఆయన ఉపయోగించిన ఖడ్గంతోను, రాయల్ ఇంజనీర్స్ సమర్పించిన పుష్పగుచ్ఛంతోను అలంకరించడం జరిగింది.

కాటన్ నివసించిన ఇంటి గురించి సెమెట్రీ నిర్వాహకులనడుగగా, ఇప్పడు ఆ ఇంట్లో గార్థ్ నర్సింగ్ హోం ఉన్నట్లు చెప్పారు. ఒక టాక్సీని పిలిచి మమ్మల్ని అక్కడకు పంపారు. సర్ ఆర్థర్ కాటన్ నివసించిన ఆ ఇల్లు చాలా అందమైన భవనం. పూర్తిగా టేకు చెక్కతో నిర్మితమైంది. అందులో ఇప్పుడు "గార్థ్ హోం" పేరిట వృద్దుల శరణాలయం నడుస్తున్నది. 1949లో బ్రిటీష్ రాణి వ్యక్తిగత వైద్యుడు లార్డ్ హార్డెన్ దీనిని స్థాపించాడు. ఈ భవనం విశాలమైన పచ్చిక బయళ్ళతోను, ఎత్తైన రకరకాలు వృక్షజాతులతోను, పూల చెట్లతోను అలరారుతున్నది. డార్కింగ్ పట్టణంలో పోస్టాఫీసు, బ్యాంకులు, షాపింగ్ స్థలాలు వంటి అన్నీ ముఖ్యమైన ప్రదేశాలకు ఈ భవనం అతి చేరువలో వుంది. ఈ నర్సింగ్ హోం అక్కడి వృద్దులకు ప్రశంసనీయమైన సేవలందిస్తున్నది.

సర్ ఆర్థర్ కాటన్ సేవలన్నీ కూడా భారతదేశానికే పరిమితం కావడంతో, బ్రిటన్లో ఆయనకు ఒక సైనికాధికారిగానే తప్ప వేరే గుర్తింపులేదు. ఆయన స్మృతి చిహ్నాన్ని చూడటానికి సెమెట్రీకి వెళ్ళగా అక్కడివారు ఆశ్చర్యపోయారు. "మేము రెండు పూటలా భోజనం చేయడానికి ఆ మహానుభావుడే కారణమనీ, అందుకే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఇంత దూరం వచ్చామనీ వారికి తెలియజేశాను. కాటన్ సమాధిని సందర్శించడానికి ఇంతకు పూర్వం వెళ్ళినవారి గురించి తెలియదు కానీ, మేము మాత్రం ఆ మహానుభావుడికి

72