దోహదపడింది. ఆ రీతిన ఏర్పడిన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారమే మేమంతా, అందుకే ఆ మహనీయుని పట్ల ఆరాధనా పూర్వకమైన కృతజ్ఞతాభావం.
డార్కింగ్‌లో కాటన్ సమాధి
సర్ ఆర్థర్ కాటన్ డార్కింగ్ పట్టణంలో చనిపోయినట్లు తెలుసుకుని, డార్కింగ్ సెమెట్రీ ఫోన్ నంబర్లను నెట్ ద్వారా సేకరించి, వారికి ఫోన్ చేసి, కాటన్ సమాధి గురించి వాకబు చేశాము. ఆ సెమెట్రీలో ఆయన సమాధి వుందని సెమెట్రీవారు చెప్పిన మీదట ఆ మహనీయుడి యొక్క స్మృతి చిహ్నాల కోసం ఆ పట్టణానికి డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శ్రీ బోయపాటి ప్రమోద్‌లతో కలసి లండన్ నుంచి రైల్లో బయలుదేరి డార్కింగ్ చేరుకున్నాము. రైల్వే స్టేషన్‌కు ఒక కిలోమీటరు దూరంలోనే డార్కింగ్ సెమెట్రీ ఉంది. ఆ సెమెట్రీలో ప్రవేశించిన మేము ఆశ్చర్యపోయాము. అది స్మశానవాటికలా కాక, సుందర ఉద్యానవనంలా అందమైన కట్టడాలతో పచ్చిక బయళ్ళతో, రకరకాల పూల మొక్కలతో చూడచక్కగావుంది.
బ్రిటన్లోని డార్కింగ్ పట్టణంలో ఉన్న ఈ సెమెట్రీ 21 నవంబర్ 1855లో ప్రారంభమైంది. "బాక్స్ హిల్" కొండను ఆనుకుని ప్రశాంత వాతావరణంలో 14 ఎకరాలలో విస్తరించి ఉన్న చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ స్మశాన వాటిక ఇప్పటికీ వాడుకలో ఉంది.
సెమెట్రీ నిర్వాహకులు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, సర్ ఆర్థర్ కాటన్ సమాధి వద్దకు తీసుకువెళ్ళి చూపారు. కాటన్ సమాధి గురించి, అక్కడవున్న ఇతర పెద్దల సమాధుల గురించిన వివరాలతో కూడిన బుక్లెట్‌ను అందజేశారు. అందులో సర్ ఆర్థర్ కాటన్ గురించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
"జనరల్ సర్ ఆర్థర్ కాటన్ బర్మా యుద్ధంలో ప్రశంసనీయమైన సేవలందించిన పిమ్మట, తన శేష క్రియాశీల జీవితాన్నంతా భారీ నీటిపారుదల
70