నా ఇంగ్లాండ్ పర్యటన...
మధుర స్మృతులు
ఆంధ్రా మెడికల్ గ్రాడ్యుయేట్సు రీయూనియన్ యు.కె. 2009 మే 2, 3 తేదీలలో కోవెంట్రీలో జరుగుతుందని ఆ సమ్మేళనంలో అతిథిగా పాల్గొనవలసిందని, డాక్టర్ సుబ్బారావు వి. చదలవాడ, డాక్టర్ రమేష్ పొట్లూరి గార్ల వద్ద నుంచి నాకు, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్షీప్రసాద్‌గారి ద్వారా ఆహ్వానమందింది.
నేను ఎన్నికల రణరంగంలో తలమునకలుగా ఉన్నాను. 2009 ఏప్రిల్ 23వ తేదీన ఎన్నిక పోలింగ్ పూర్తయింది. 27వ తేదీన మేమిరువురమూ లండన్‌కి పయనమైనాము.
నేను అమెరికా, చైనా, జర్మనీ మొదలైన దేశాలు అప్పటికే సందర్శించి ఉన్నప్పటికీ, నా మనస్సు ఇంగ్లాండు వైపు చూస్తుండేది. దానికి కారణం మనదేశాభివృద్ధికి, ప్రత్యేకించి తెలుగుజాతి అభ్యుదయానికి కారకులైన వారిపై నాకు చిన్ననాటి నుండి అభిమానం ఉండడం కావచ్చు. తెలుగు భాషోద్ధారకుడు సి.పి. బ్రౌన్, కృష్ణ-గోదావరి డెల్టాల అభివృద్ధి కారకుడైన సర్ ఆర్థర్ కాటన్, భారతదేశపు ప్రథమ సర్వేయర్ జనరల్‌గా పనిచేసి, కైఫీయత్తుల సేకరణ ద్వారా తెలుగువారి చరిత్ర రచనకు ఆధారభూతుడైన, అమరావతి తదితర బౌద్ధ స్తూపాల శిల్ప వైశిష్ట్యాన్నివెలికితీసి లోకానికి చాటి చెప్పిన కల్నల్ కాలిన్ మెకంజీలపై తెలుగువారందరికీ లాగానే నాకు కూడ భక్తి భావం ఉంది. తెలుగుభాషకు అపారమైన సేవ చేసిన నేనెరిగిన మరో
1