హౌస్ లైబ్రరీ నుంచి సేకరించి, మద్రాసు లైబ్రరీకి పంపాడు.
తెలుగు, సంస్కృత గ్రంథాల నెన్నింటినో పరిష్కరించి, ప్రచురించాడు. Madras Journal of Literature and Science కు సంపాదకుడుగా పనిచేశాడు. ఆయన ప్రాచీన కావ్యాలు సేకరిస్తున్నప్పుడు చోటు చేసుకున్న అనేక సంఘటనలను కథలు కథలుగా లండన్ నుంచి వెలువడే ది ఆసియాటిక్ జర్నల్లో వ్రాశాడు.
తెలుగు సాహిత్య పరిరక్షణకు బ్రౌన్ తన స్వంత డబ్బును ఖర్చు చేశాడు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రతి పైసా పొదుపు చేసేవాడు. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో వుండి కూడా తెలుగు కోసం ఖర్చు చేయడానికి వెనకడుగు వేయలేదు. తనకు వస్తున్న జీతంతో ఎంతో మంది పండితులను, వ్రాయసగాళ్ళను పోషించాడు.
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కావ్యాలను సేకరించి ప్రచురించడమే కాక బ్రౌన్ జనసామాన్యం నోళ్ళలో సజీవంగా వుంటూ, తరం నుంచి తరానికి బదిలీ అవుతున్న మౌఖిక సాహిత్యాన్ని ఎంతో సేకరించి, గ్రంథస్థం చేసి భద్రపరిచాడు. ముద్రణకు అనువుగా వుండటానికి వీలుగా తెలుగు లిపిని సంస్కరించాడు. 'అరసున్నాను, బండి"ఱ"ను పరిహరించి, క్రావడిని మార్చాడు. తెలుగు పద్యపాదాలను 'యతి' స్థానంలో విరచడం ఆయన ప్రారంభించిన సంప్రదాయమే. బ్రౌన్ దొరకు యావత్ తెలుగు జాతి రుణపడివుంది.
బ్రౌన్ సమాధి సందర్శన
2009 ఏప్రిల్ 26వ తేది నా జీవితంలో మరపురాని రోజు, లండన్లోని కెన్‌సల్ గ్రీన్ స్మశానవాటికలో ఉన్న సి.పి. బ్రౌన్ సమాధిని సందర్శించడం ఒక మధుర స్మృతి. లండన్ రావలసిందిగా యు.కె.లోని తెలుగు వైద్యబృందం పంపిన ఆహ్వానం పురస్కరించుకుని లండన్ వెళ్ళిన
57