దాని యాజమాన్యము మరొకరికి అప్పగించేను. కాని అది సరిగా నడవలేదు. తరువాత క్రైస్తవ మిషనరీలకు దాన్ని అప్పగించేను."
1824లో ఆయనకు వేమన సాహిత్యం విూద ఆసక్తి కలిగింది. వేమన సాహిత్యాన్ని తెలుగు ఛందస్సును, వ్యాకరణాన్ని తిప్పాభొట్ల వెంకటశివశాస్త్రి, అద్వైత బ్రహ్మశాస్త్రి మార్గదర్శకత్వంలో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వేమన పద్యాలను సేకరించి, 698 పద్యాలతో 1827లో మొదటి సంపుటాన్ని 1164 పద్యాలతో 1839లో రెండవ సంపుటాన్ని ప్రచురించాడు. వీటికి ఆంగ్లానువాదాలు కూడా ప్రచురించాడు. బందరు నుంచి ఆయనను రాజమండ్రికి బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన తెలుగు సాహిత్య సేవను, భాషాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిపోయే దశలో ఉన్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను సేకరించాడు. కొందరు వ్రాయసగాళ్ళను తన స్వంత డబ్బుతో నియమించి, వారితో ఈ కావ్యాలకు వ్రాత ప్రతులను సిద్ధం చేయించి, పండితులతో చర్చించి, దోషాలను సరిదిద్ది పరిష్కరించాడు. ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్ర మహాభాగవతాన్ని పునర్ముద్రించాడు. శోభావిహీన అయిపోయిన తెలుగు సరస్వతికి ఆశ్రయం కల్పించి, పూర్వవైభవాన్ని తెచ్చాడు.
తెలుగు నేర్చుకోవడంలో ఆసక్తివున్న బ్రిటిష్ వారి కోసం ఆయన ఎన్నో వ్యాకరణ పుస్తకాలను, ఛందో గ్రంథాలను వ్రాశాడు. తెలుగు-ఇంగ్లీషు; ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను, తెలుగు వాచకాలను మొదటిసారిగా తయారు చేశాడు. సాహిత్య పత్రికలలో ఎన్నో వ్యాసాలను వ్రాశాడు. క్యావాలను అనువదించాడు. ఇవన్నీ ఇప్పటికీ మదరాసు ఓరియంటల్ లైబ్రరీలో ఉన్నాయి.
1824 నుంచి తిక్కన, పోతన, వేమన వంటి ప్రసిద్ధ కవుల రచనలను సేకరించడం ప్రారంభించాడు. 1835-38 మధ్య లండన్‌లో ఉన్నప్పుడు ఆయన 2,106 దక్షిణ భారతీయ భాషలకు చెందిన వ్రాత ప్రతులను ఇండియా
56