పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణులు, శూద్రులు వీటి గురించి పనిచేసేవారు. వారికందరకు జీతము లేర్పాటు చేసెను. ప్రాచీన కావ్యాలు కాగితాల మీద వ్రాయడము, సప్రమాణికములైన పాఠములతో వానిని సంస్కరించడము, పదానుక్రమణికలు తయారుచేడము, వ్యాఖ్యానాలు వ్రాయడము వారి పని."

తెలుగులో కోర్టు తీర్పు ఉత్తర్వులు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది.

ఆ కాలంలో గుంటూరు ప్రాంతం భయంకరమైన క్షామాన్ని ఎదుర్కొంటున్నది. 1882-83లలో ఈ క్షామాన్ని ఎదుర్కోవటంలో బ్రౌన్ కనబరచిన పాలనాదక్షత అందరి మన్ననలు పొందింది. 1834లో ఆయన ప్రభుత్వోద్యోగం నుంచి విడుదలై లండన్ కు వెళ్ళిపోయి 1885 నుంచి 1838 వరకు అక్కడే ఉన్నాడు. 1838లో ఈస్టిండియా కంపెనీకి పర్షియన్ అనువాదకుడుగా బ్రౌన్ తిరిగి మద్రాసుకు చేరుకున్నాడు. మద్రాసు కాలేజి బోర్డు సభ్యుడుగా కూడా సేవలందించి 1854లో అనారోగ్యం వల్ల ఉద్యోగ విరమణ చేసి, లండన్ కు వెళ్ళిపోయాడు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశాడు. ఆయన 1884 డిసెంబర్ 12న కన్నుమూశాడు.

బ్రౌన్ తెలుగు భాషాసాహిత్యాలకు చేసిన సేవలు ఎనలేనివి. ఉచిత విద్యను, ఉచిత ఆహారాన్ని అందించే పాఠశాలలను నెలకొల్పారు. ఈ విషయం సి.పి. బ్రౌన్ తన స్వీయచరిత్రలో ఈ విధంగా వ్రాసుకున్నారు -

"నేనెక్కడ పనిచేసినా, బాలురకు తెలుగు, హిందూస్థానీ విద్యాభ్యాసము నిమిత్తము ఉచిత పాఠశాలలను నెలకొల్పేవాడను. ఆయా ప్రాంతము వారినే ఉపాధ్యాయులుగా నియమించేవాడను. 1821లో కడపలో రెండింటిని, 1823లో బందరులో రెండింటిని స్థాపించేను.

1844లో మదరాసులో ఒక ఉచిత పాఠశాల పెట్టేను. అందులో 80 మంది తెలుగు, తమిళ విద్యార్ధులుండేవారు. ఇది ఏడేండ్లు నడచినది. కానీ

55