బ్రిటిష్ జాతీయుడైన సి.పి. బ్రౌన్ 10.11.1798న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ కలకత్తాలో ఒక అనాధ శరణాలయానికి, మిషనరీకి మేనేజర్ గా పనిచేశాడు. ఈయన సంస్కృతం సహా ఎన్నో భాషల్లో పండితుడు. ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన తండ్రి మరణానంతరం 1812లో ఇంగ్లండుకు వెళ్ళిపోయాడు. తిరిగి 1817 ఆగస్టు 4వ తేదీన మద్రాసుకు చేరుకున్నాడు. భారత్ లో సివిల్ సర్వీసులో ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైన శిక్షణ పొందడానికిగాను హెయిలీ బర్రే కళాశాలలో జేరాడు.
1820లో మద్రాసు గవర్నర్ థామస్ మన్రో, ప్రతి ప్రభుత్వాధికారి ఒక స్థానిక భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఉత్తర్వులు వేశాడు. కాబట్టి పాఠ్యాంశాలలో భాగంగా సి.పి. బ్రౌన్ ఒక స్థానిక భాషను నేర్చుకోవలసి వచ్చింది. ఆ పరిస్థితిలో ఆయన తెలుగు భాషను ఎంచుకుని, వెలగపూడి కోదండరామ పంతులు శిక్షణలో తెలుగు నేర్చుకోవడానికి పూనుకున్నాడు.
బ్రౌన్ తెలుగు పరీక్షను, సివిల్ సర్వీసు పరీక్షను 1820లో పాసైనాడు. కడప జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న హన్‌బర్రీకి డిప్యూటీగా బ్రౌన్‌కు ఉద్యోగం వచ్చింది. హన్బర్రీ తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడటం గమనించిన బ్రౌన్ ఆయన నుంచి స్ఫూర్తిని పొంది, తాను కూడా తెలుగు మీద పట్టు సాధించాలని పూనుకున్నాడు. ఆయన 1824లో మచిలీపట్టణానికి, ఆ తరువాత రాజమండ్రికి బదిలీ చేయబడ్డాడు. బందరులో సి.పి. బ్రౌన్ చేసిన తెలుగు భాషా సేవ వారి మాటల్లోనే:
“తెలుగు దేశానికి రాజధానియైన బందరు (మచిలీపట్టణము)లో నేను మూడు సంవత్సరములు న్యాయాధిపతిగా వ్యవహరించేను. అక్కడ నేను సంస్కృతాంధ్ర గ్రంథముల వ్రాతప్రతులు చాలా సంపాదించేను. వాని సంపాదన నాకొక "పిచ్చిగా" పరిణమించిందంటే అతిశయోక్తికాదు. అక్కడ నేను ఒక దమ్మిడీ నిలవచేయలేదు. నా వద్ద ఎప్పడూ ఇరవై మంది
54