పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు భాషా భానుడు

సి. పి. బ్రౌన్


తెలుగు భాషా సాహిత్యాలు కొడిగట్టి పోకుండా చేతులడ్డుపెట్టి కాపాడిన మహానుభావుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలందించి తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

తెలుగు సాహిత్యం 18వ శతాబ్ద కాలానికి క్షీణ దశకు చేరుకుంది. అప్పటి సాంఘిక, రాజకీయ పరిస్థితులతో పాటు, తెలుగులో సృజనాత్మక కవులు కొరవడటం, నిరక్షరాస్యత పెరిగిపోవడం, తెలుగు భాషాసాహిత్యాలను పోషించి, ప్రోత్సహించిన విజయనగర రాజుల వంటి ప్రభువులు ఆ లేకపోవడం ఇందుకు ముఖ్య కారణాలు.

సి.పి. బ్రౌన్ ఈ ప్రాంతానికి అధికారిగా వచ్చి, తాళపత్ర నిక్షిప్తమైవున్న అనర్ఘ తెలుగు సాహిత్యాన్ని సేకరించి, వెలికితీసి, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించారు. ఆయన మాటల్లోనే "తెలుగు సాహిత్యం మరణశయ్యపై ఉంది. 1825 నాటికి దీపం మిణుకుమిణుకు మంటున్నది. తెలుగు సాహిత్యం చనిపోవడం నేను చూశాను. అయితే ముప్పె ఏళ్ళలో దాన్ని తిరిగి బ్రతికించగలిగాను".

53