Jump to content

పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వజ్రాన్ని విక్టోరియా మహారాణికి సమర్పించాడని ప్రచారం చేశారు. అయితే, ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మలేదు. ధులీప్‌సింగ్ విధిలేని పరిస్థితులలోనే కోహినూనూర్ ను విక్టోరియా రాణికి ఇచ్చాడన్నది జగమెరిగిన సత్యం.

కోహినూర్ వజ్రం ఇంగ్లాండ్ చేరిన పిమ్మట ఆదేశంలో కొన్ని అరిష్టాలు సంభవించాయి. ఇదంతా కోహినూర్ వల్లే జరిగిందని ప్రచారం జరిగింది. కోహినూర్ ఎవరివద్ద వుంటే వారికి కీడు జరిగిందని, అశాంతికి, రక్తపాతానికి కోహినూరు కారణమవుతూ వచ్చిందని పెద్ద దుమారం రేగింది. దీనిని తిప్పికొడుతూ డల్‌హౌసీ 7.1.1858న మాల్టా నుంచి ఒక లేఖ వ్రాశాడు. అందులో :

"కోహినూర్ వల్ల దానిని గోల్కొండ నుంచి పొందిన అక్బర్ చక్రవర్తికి ఏ అపకారం జరగలేదు. అతని కుమారునికి, మనుమనికి కూడా ఏ కీడు జరగలేదు. మొగల్ చక్రవర్తులలో అత్యంత ప్రసిదుడైన ఔరంగజేబుకూ దానివల్ల ఏ అరిష్టం జరగలేదు. నాదిర్‌షా, అహ్మద్‌షా దులానీ దీనివల్ల లబ్దినే పొందారు. మహారాజా రంజిత్‌సింగ్ ఈ వజ్రాన్ని తన వద్ద నుంచుకొని మొత్తం సిక్కు జాతికే తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు. చరిత్రలో చక్రవర్తులకు, మహారాజులకు, మహాయోధులకు ఈ వజ్రం విజయచిహ్నంగా నిలిచింది. ఒకవేళ దీనివల్ల అరిష్టం ఉందని మహారాణి వారు భావిస్తే, ఆ వజ్రాన్ని నాకు ఇచ్చివేయండి. అరిష్టమేదో నేనే భరిస్తాను".

విక్టోరియా మహారాణి కోహినూర్‌ను డల్‌హౌసీకి తిరిగి ఇచ్చివేయలేదు. అది బ్రిటిష్ రాణుల ముఖ్య ఆభరణాలలో ఒకటయి పోయింది. 1911లో క్వీన్ మేరీ పట్టాభిషేకం సందర్భంగా తయారు చేసిన వజ్రాల కిరీటంలో కోహినూర్ వజ్రం కిరీటం ముందుభాగంలో మధ్యన నిలిచి ప్రముఖ స్థానం పొందింది.

20వ శతాబ్దంలో కోహినూర్ వజ్రం ఎవరికి చెందాలి అన్న విషయమై పెద్ద వివాదమే చెలరేగింది. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఈ వివాదాన్ని బాగా వాడుకున్నాయి. 1947లో భారత ప్రభుత్వం కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇచ్చి వేయమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. కోహినూర్ వజ్రం రంజిత్‌సింగ్‌కు సంక్రమించిందని చరిత్ర చెబుతున్నా ఈ విషయాన్ని రంజిత్

50