పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండాలుగా విరగదొక్కుకుని వచ్చారని, దీని రక్షణ కోసం ఎన్ని ఏర్పాట్ల చేసినా తక్కువే అనిపించాయని "ది టైమ్స్" దిన పత్రిక వ్రాసింది.

కోహినూర్ వజ్రాన్ని సరిగ్గా సానబట్టలేదని, దీన్ని అన్ని కోణాల్లో తగిన విధంగా సానబట్టితే, కోహినూర్ అందాలు ద్విగుణీకృతమవుతాయని బ్రిటిష్ వజ్ర నిపుణులు భావించారు. ఆ ప్రకారం ఎంతో మంది శాస్త్రవేత్తలను, వజ్రనిపుణులను రావించి, కోహినూర్ను పరిశీలింపజేసి, సుదీర్ఘంగా చర్చలు జరిపి, కోహినూర్ సహజ అస్థిత్వానికి భంగం వాటిల్లకుండా దానిని తిరిగి సానబట్టడానికి ఒక సమగ్ర కార్యాచరణ పథకాన్ని రూపొందించారు. ఈ సానబట్టే పనిని ఎప్పటికప్పుడు వివరంగా రికార్డు చేయాలని కూడా నిర్ణయించారు. ఆ విధంగా కోహినూర్‌ను సానబట్టే పని 38 రోజులు కొనసాగింది. దీనికి 8,000ల బ్రిటిష్ ఫౌండ్లు (40,000ల అమెరికన్ డాలర్లు) ఖర్చయ్యాయి. చివరికి 108.98 మెట్రిక్ కారెట్స్‌తో కోహినూర్ వజ్రం నిగ్గు తేలింది. ఈ క్రమంలో వజ్రం తన పరిమాణంలో 43 శాతం నష్టపోయింది.

ఈ అమూల్య వజ్రాన్ని భారత్ నుంచి స్వాధీనం చేసుకోవడంపై ఇంగ్లండ్‌లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఇంగ్లండ్ సొత్తు కాదనీ, దౌర్జన్యంగా దానిని స్వాధీనం చేసుకోవడం అనైతికమని వాదిస్తున్నవారి నోళ్ళ కట్టేయడానికి ఒక పథకం వేయబడింది. పంజాబ్ రాజ్యవారసుడు ధులీప్ సింగ్ మైనర్ అన్న కారణంగా అతని రాజ్యాన్ని కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్న ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం, అతని సంరక్షణ భాధ్యతలను లోగిన్ అన్న అతనికి అప్పగించింది. లోగిన్ మరణానంతరం ఈ బాధ్యత అతని భార్య లేడీ లోగిన్‌కు అప్పగించబడింది. ఒకరోజు ధులీప్సింగ్‌ను లేడి లోగిన్ విక్టోరియా మహారాణి సమక్షానికి తెచ్చింది. విక్టోరియా రాణి ధులీప్ సింగ్ ను దగ్గరికి తీసుకుని, తిరిగి చెక్కడం మూలంగా ఆకారం మారిపోయిన కోహినూర్ వజ్రాన్ని అతనికి ఇచ్చి, దీనిని గుర్తుపట్టగలవా అని ప్రశ్నించింది. ధులీప్‌సింగ్ ఆ వజ్రాన్ని చూసి అస్పష్టంగా ఏదో చెప్పి, విక్టోరియా రాణికి దాన్ని తిరిగి ఇచ్చివేశాడు. దీనితో ధులీప్‌సింగ్ ఇష్టపూర్వకంగానే కోహినూర్

49