Jump to content

పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడా బలహీనమైపోయింది. భోగభాగ్యాలను దోచుకోవాలనే దురాశ చుట్టుప్రక్కల రాజులకు, విదేశీయులకు కలిగింది. 1786లో పర్షియా రాజైన నాదిర్‌షా 1789లో భారతదేశం మీదికి దండెత్తి వచ్చాడు. అప్పటి మొగల్ చక్రవర్తి మహ్మద్‌షా 1719లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఎల్లపుడూ అతని బాహువులలో మగువ, చేతిలో మధుపాత్ర వుండవలసిందేనట. నాదిర్‌షాతో కర్నాల్‌లో జరిగిన రెండుగంటల యుద్ధంలోనే అపారమైన మొగలాయి సైన్యం చెల్లాచెదరైపోయింది. 20 వేల మందికి పైగా సైన్యం హతులైనారు. అంతకంటే పెద్ద సంఖ్యలో బందీలైనారు. నాదిర్‌షా సరాసరి ఢిల్లీ కోటలో చొరబడి, అక్కడి సంపదనంతా తన వశం చేసుకున్నాడు. అతడి సైనికులు ఢిల్లీ నగరం విూద పడి దోచుకున్నారు. మొగల్ చక్రవర్తికి నాదిర్‌షాను మంచి చేసుకుని అతనికి ఆతిథ్యమివ్వక తప్పలేదు.

నాదిర్‌షా హస్తగతం చేసుకున్న సంపద విలువ ఇంత అని చెప్ప వీలు లేదు. ఇది 70 కోట్ల నవరసులుంటుందని ప్రెజర్ అనే అతను వ్రాశాడు. నగలే 25 కోట్ల విలువ గలవి. రత్నఖచిత మయూర సింహాసనం, ఇంకా తొమ్మిది సింహాసనాలు, వెండి, బంగారు, రత్న ఖచిత ఆయుధాలు, ఇతర వస్తువులు తొమ్మిది కోట్ల విలువ చేస్తాయట. నాదిర్‌షా 60 లక్షల వెండి నాణాలు, అనేకవేల బంగారు నాణాలు, కోటి విలువగల బంగారు సామాను, 50 కోట్ల విలువగల బంగారు నగలు పట్టుకుపోయినట్లు అతని కొలువులో వజీరుగా చేరిన ఒక భారతీయుడి క్రింది ఉద్యోగి అయిన ఆనందరాం వ్రాశాడు. నాదిర్‌షా యొక్క చరిత్రకారుడి లెక్కప్రకారం నాదిర్‌షా ఒకకోటి తొంభై వేల నవరసుల ఖరీదుగల నాణేలను పట్టుకుపోయాడు. స్కాట్లాండ్ దేశపు గ్రంథకర్త ఒకరు 11 కోట్ల 90 లక్షల నవరసుల ఖరీదుగల సంపదను నాదిర్‌షా తరలించుకుపోయాడని వ్రాశాడు.

కోహినూర్ వజ్రాన్ని నాదిర్‌షా చేజిక్కించుకున్న వైనం ఈ విధంగా వుంది. ఈ వజ్రం వున్న ప్రదేశం అతనికి ఎవరూ చెప్పలేక పోయారు. చివరికి అహ్మద్‌షా అంతఃపుర స్త్రీ ఒకరు ఈ వజ్రం ఆయన తలపాగాలోనే

44