ఏకాలంలోను విలువ కట్టలేకపోయారు.
హుమాయూన్ ఈ వజ్రాన్ని పర్షియా రాజుకు కానుకగా ఇవ్వడాన్ని అప్పడు పర్షియా రాజు దర్బారులో వున్న గోల్కొండ నవాబు కులీకుతుబ్‌షా రాయబారి ఖూర్‌షా ధ్రువీకరించాడు. దీని బరువు 6 మిస్మాలు ఉందనీ, మొత్తం ప్రపంచం చేసే రెండున్నర రోజుల ఖర్చుకు ఇది సమానమని ఆయన చెప్పాడు. అయితే, పర్షియారాజు షా తహమస్ దీనిని అంతగా నమ్మలేదని, తరువాత దీనిని భారత్‌లో తన మిత్రుడు అహ్మద్‌నగర్ రాజైన బర్హన్ నిజాంకు కానుకగా తనకు నమ్మకస్తుడైన మెహతర్ జమాల్ అనే వ్యక్తితో పంపాడని, అయితే ఈ వ్యక్తి ఆ కానుకను అందజేయక నమ్మకాన్ని వమ్ము చేసినందున అతనిని పర్షియారాజు అరెస్టు చేయించాడని ఖూర్‌షా వ్రాశాడు. ఆ విధంగా ఈ వజ్రం తిరిగి భారత్ చేరుకుని, ఎన్నో చేతులు మారింది. ఈ సంఘటన 1547లో జరిగింది. 1650లో పాలన చేస్తున్న మొగలాయి చక్రవర్తి షాజహాన్ తన మూడవ కుమారుడు ఔరంగజేబును దక్కన్‌కు గవర్నర్‌గా వేశాడు. ఔరంగజేబు సామ్రాజ్యవాది. దక్కన్‌లోని రాజ్యాలను కబళించడానికి పథకాలు వేసేవాడు. ముఖ్యంగా అపారమైన వజ్రాల గనులున్న గోల్కొండ రాజ్యం విూద తన దృష్టిని కేంద్రీకరించాడు.
ఆ కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన విూర్ జుమ్లా గొప్ప రత్నాల వర్తకుడు. పర్షియా రాజ్యంలో మంచి పేరు ప్రతిష్టలున్న ఈయన చేతుల్లోనే గోల్కొండ రాజ్యపు వజ్రాల వ్యాపారం వుండేది. ఈయన గోల్కొండ రాజ్యంలోని విస్తారమైన గనుల నుంచి అపార రత్నరాసులను ప్రోది చేసుకోవడమేగాక రాజమాతతో అక్రమ సంబంధం పెట్టుకొని దొరికిపోయాడు. అందువల్ల ప్రాణభయంతో గోల్కొండ నుంచి పారిపోయి, మీర్ జుమ్లా దక్కన్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఔరంగజేబును 1656లో కలిశాడు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్ళి ఔరంగజేబు తండ్రి షాజహానును కలిశాడు. ఇతను తండ్రీ కొడుకు లిద్దరికీ అమూల్యమైన రత్న సంపదను
42