పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 అమరావతి శిథిలాలకు సంబంధించిన మరికొన్ని కళా ఖండాలను సముపార్జించాలన్న కోరిక ఫ్రాంక్స్‌కు కలిగింది. ముఖ్యంగా బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న కళా ఖండాల పరంపరలోవి కావాలని ఆయన కోరుకున్నారు. స్వెల్ కు ఆయన 24 ఫిబ్రవరి 1881లో వ్రాసిన లేఖలో ఇందుకుగాను తన స్వంత డబ్బును కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నానీ, కాబట్టి కళా ఖండాలున్న పాలరాళ్లను కృష్ణా నది కాలువ ద్వారా మదరాసుకు తరలించవలసిందని కోరాడు. అదే చివరకు జరిగింది. ఒక వేళ అన్ని రాళ్లు ఒకేసారి బ్రిటిష్ మ్యూజియానికి తరలించడం మంచిదని నీవు భావిస్తే, ఆ విషయం నాకు వెంటనే తెలియజేసినట్లయితే, ఈ అంశం మ్యూజియం ట్రస్టీల ముందుంచి, వారి అనుమతి పొందుతానని కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆ పరిస్థితిలో నావికాదళానికి చెందిన ఒక ఓడను ఇందుకోసం నియోగించడం జరుగుతుందని కూడా వ్రాశాడు.

మద్రాసు గవర్నర్‌కు స్వెల్ చేసిన అభ్యర్ధన ఆధారంగా ఆయన ప్రాంక్‌కు వ్రాసిన లేఖలో పేర్కొన్న ప్రకారం రెండు కళాఖండాలను బ్రిటిష్ మ్యూజియానికి పంపడానికి ఆమోదించబడింది. 19వ శతాబ్దం చివరి భాగంలో చేసిన ఒక చట్టం ద్వారా భారతదేశ ప్రాచీన సాంస్కృతిక సంపదను అక్కడే పరిరక్షించాలనే కట్టుబాటు విధించడం మూలంగా, సిపాయిల తిరుగుబాటు కాలంలో మాదిరిగా ప్రాచీన సాంస్కృతిక సంపదను ఒకేసారి పెళ్లగించి తీసుకుపోయే అవకాశం లేకుండా పోయింది.

అమరావతి శిల్పాలు బ్రిటిష్ మ్యూజియంలో 1880 నుంచి 1940 వరకు అద్దాల ప్రేమ్ల వెనకాల సురక్షితంగా ఉండి, సందర్శకులకు ఈ ప్రపంచంలోని ఒక భాగానికి సంబంధించిన ప్రాచీన సంస్కృతిని పరిచయం చేస్తూ నిలిచాయి. అవి బ్రిటిష్ సామ్రాజ్యపు వైభవం వెలిగిపోతున్న రోజులు. భారతీయ అద్భుత శిల్ప సంపదను ప్రపంచ ప్రాచీన ప్రఖ్యాత నాగరికతల సరసన సగౌరవంగా నిలిపిన కాలం. అద్భుత భారతీయ ప్రాచీన శిల్ప సంపదను ప్రపంచ పాఠకులకు, మ్యూజియం సందర్శకులకు పరిచయం