పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఈ పదికథల్లోనూ రోమాన్సు, హాస్యం, సంస్కరణ, ఆత్మచరితం, రాచకీయం, —ఇట్టివెన్నోరూపాలు పఠితకు పొడకట్టుతయి. ఎత్తుకున్న విషయాన్ని పోషించటానికి తగు యత్నం ప్రతికథలోనూ ప్రస్ఫుటమవుతుంది.

ఇందులో_ 'అంతే, నానోము'_'సత్యాగ్రహం'_'మాబావ'-'టాకీలో సమావేశం'_ఇవి సర్కారాంధ్రులక్కూ_డా అనర్గళంగా చదువె వీలయ్యే రమ్యమైన వ్యావహారికంలో సాఫీగా నడిచాయి. తక్కినవి నిజాం ప్రాంతీయమైన వాడుకభాషలా వున్నాయి.

'ఆడిపాప" కథ నైజాంరాష్ట్రంలోని ఒక దురాచారానికి సంబంధించి0ది .

ఇట్లు ఈ గ్రంథము నిజాము రాజ్యములో ప్రవాహిక ఐన భాషనూ, ప్రచారమందున్న ఆచారాల్ని తెలుసుకోడానికి చక్కగా అనుకూలిస్తూ వుంది".

'ప్రజామిత్ర'.

"ఈకధలలోని విషయము సామాజికాచార వ్యవహారాదులకు సంబంధించినది. నిష్ఫలం, నూమూర్తిఖర్మం అనే కధలలో మానసిక స్థితి నిరూపణము కొద్దిగా ఉన్నది. కథలు సుబోధముగాఉండి కాలక్షేపానికి బాగా పనికి వచ్చేవే అయినా ఎక్కడా అసభ్యత దొరలకుండా ఉండడము గొప్ప సుగుణము, నైజామురాష్ట్ర వ్యావహారికభాషతో పరిచయములేనివారికి ఈగ్రంధములోఉన్న భాష అక్కడక్కడ నట్టుతుంది. ఒకటిరెండు కధలు చదివేసరికి పదముల అంతములెట్టివో తెలిసిపోవడమువల్ల పోనుపోను భాష నుఖమవుతుంది. కొన్నిమాటలు కొత్తవయినా సందర్భాన్నిబట్టి వాటి అర్థము తెలుస్తుంది. కొన్ని పలుకుబడులు కొత్తగా ఉంటవి. తోలుకురావటం మన ప్రాంతాలలో మనుష్యుల పరంవాడరు. క్రియాప్రత్యయాంతాలు అక్కడ హ్రస్వములు. వస్తరు—చూస్తరు అని ఉంటవి.

ఈరీతిగా కవులూ గ్రంథకర్తలూ ఆయాప్రాంతీయభాషలు చక్కగా వాడుకచేస్తూ గ్రంథాలు రచించి ప్రకటిస్తే ఆంధ్రభాషాస్వరూపము బాగా తెలుస్తుంది.

ఈగ్రంథమాల మంచిమంచి పుస్తకాలు తరుచుగా ప్రకటిస్తూ వృద్ధిలోకి రావలెననీ సంపాదకుల ఆశయాలు నెరవేరవలెనని కోరుతున్నాము".

'ప్రతిభ'.