పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పత్రికాభిప్రాయములు.

'కమ్మతెమ్మెరలు.'

"--- మంచిరసవంతంగా వున్నాయి. రచనా విధానంలో వ్యావహారికభాష -------- నైజామాంధ్ర పుత్రుల వ్యావహారిక తెలుగురచనకు వన్నె తెచ్చినది. ఈపుస్తకం అన్నివిధముల సంపాదకుల ఆశయాలకు ప్రదీపనమును చేకూరుస్తోంది."

'గృహలక్ష్మి'.

"మెచ్చుకోదగినరీతిగా యీకథలను తీర్చినారు. ఈయువకసోదరులు భావికాలంలో ఇంకా మంచిపేరు ప్రతిష్టలు సంపాదించే లక్షణాలు వ్యక్తపరిచినారు. మంచి ఆరితేరినకలాలు వ్రాసేరీతిగా 'ఆడివాప' 'నిష్ఫలం' 'ఎందుకు?' అనే కధలున్నవి........ ఈకథలలో చాలామంది తెలంగాణాలోని వ్యావహారిక తెనుగును ఉపయోగించినారు. దానికి మేము హర్షించినాము."

'గోలకొండ పత్రిక'.

ఈరచయితలు "ఇంకా కథచెప్పే వొడుపును చేజిక్కించుకొని, ప్రపంచానుభవాన్ని కవితాసుందరంగా చెయ్యగలరనే ధైర్యమునకున్నూ ఈ గ్రంథ మవకాశమిచ్చుచున్నయది."

'ఆంధ్రవారపత్రిక'.