పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండో ప్రపంచయుద్ధమా?

కాని మీచేతుల్ని స్తంభింపచేసేస్తాను.” అన్నది ఆ భయంకర ధ్వని.

అప్పుడు జర్మన్ సైనికులన్నారు "మేము ఏ పాపమూ ఎరుగని జర్మనీ ప్రజలము. ఈ ఇంగ్లీషువారూ ఫ్రెంచివారూ మమ్మల్ని ఇరవైఏళ్ళక్రింద యుద్ధంలో వెూసంచేసి ఓడించారు. అప్పటినుంచీ మమ్మల్ని తలయెత్తుక తిరగనీయరు. మా కాళ్లుచేతులు కట్టిపారేశారు. మేము ఎట్లాగో కాలూ చెయ్యీకూడ తీసుకుని లేవబోతూంటే వీళ్లకు కంటకంగాఉంది. మమ్మల్ని అణిచి పెడదామని చూస్తున్నారు. మా దేశాన్ని నాలుగు మూలలనుంచీ “గిరి" (encircle) వేసి కూర్చున్నారు మా వ్యాపారం సాగనీయరు పైగా మమ్మల్ని 'బ్లాకేడు' (తిండికి, పరిశ్రమలకు కావలసిన పదార్థాలను స్థలాంతరములనుండి రానీయకుండ) చేసి మాకు అన్నం దొరక కుండా చేస్తారట. మా ఆడవాళ్లూ పిల్లలూ అన్నంలేక అలమటిస్తూంటే మేము చూసి ఊరుకోగలమా ? మా వీరజాతి చావైనా ఎదుర్కొంటుందికాని కలుగులో ఎలకల్లాగపడి ఉండమంటె మేము ఎన్నాళ్ళు సహించగలము? మాకు వ్యర్థపు బ్రతుకుకన్న ఆత్మగౌరవంతో చావు మేలని మా విశ్వాసం"అన్నారు.

బ్రిటిషుసైనికుడు తన పక్షాన, తన ఫ్రెంచిమిత్రుడి పక్షాన ఇట్లా చెప్పాడు. "చూశారా ! ఫ్రాన్సూ, నా దేశము కూడా శాంతినే కోరుతున్నాయి . ఈ మాట ప్రపంచకంలో ఎవరినైనా అడిగిచూడండి. జర్మనీవారిని మేము వెనకటి యుద్ధంలో మోసంచేసి ఓడించామనడం శుద్ధ అబద్ధం. వారిని