పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండో ప్రపంచయుద్ధమా ?

యుద్ధజూదములో పందెములేమిటి ?

ఇద్దరు సైనికులు - ఒకడు బ్రిటిషు, ఒకడు ఫ్రెంచి - ముఖాలకి విషవాయు కవచాలు తగిలించుకొని నిశ్శబ్దవేగంగా తోసుకుపోతున్నారు. చేతుల్లో హాండుగ్రెనేడులు (చేతితోవిసరబడు బాంబులు) భుజాలకు తుపాకులు. అడుగడుక్కీ వారు ఆత్రంతో దిక్కులు స్తనశల్య పరీక్షగా చూస్తున్నారు ఏ మూల నుంచి శత్రువుతలయెత్తుతోడో అని. చీకటి తెర ఆశాంతములను కనబడకుండా చేసేసింది. వారు గుసగుసలుకూడా చేసుకోడంలేదు. గాలికి చెవులున్నాయేమో! ఎక్కడనుంచి ఊడిపడ్డారోకాని తమోగర్భం చీల్చుకొని ఇద్దరు జర్మన్ సైనికులు వెనకటివారివలెనే వికృత ముఖాలు ధరించి ఆపాదమస్తకం మారణసాధనాల్తో సమీపిస్తున్నారు. ఉభయులూ వీరావేశంతో ఒళ్ళుమరచి ప్రతిపక్షులవంక పరిగెత్తుతున్నారు. వారి చేతులు అప్రయత్నంగానే శత్రువునిగురి చూస్తున్నాయి. క్షణకాలంలో అక్కడ 'హా'యను ఆర్తనాదము, ఒక వెఱ్ఱికేక; నాలుగు మిడిగుడ్లుపడ్డ వీరమానవశవాలు. అంతా నిశ్శబ్దము. ఇంతట్లో ఏమూలనుంచో ఒక అదృశ్య భైరవనినాదము వినబడింది. "ఆగండి! ఈశ్మశాన రంగం నాది. నాఅనుజ్ఞ లేకుండా మీరిక్కడ చావడానికి వీలులేదు. మీరెవరు? ఎందుకు అన్యోన్యం భస్మీపటలం చేసుకుంటున్నారు? చెప్పండి చెపితే