Jump to content

పుట:రాయల రాజనీతి.djvu/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూమిక.

ఈగ్రంథము శ్రీకృష్ణదేవరాయ లొనరించిన యాముక్తమాల్యదయందలి రాజనీతిప్రకారమ బని గ్రంథకర్త పీఠికవలనఁ దెలియ నగును. నీతిబోధకములగు గీతములు, చరిత్రములు, నవలలు, కథలు, మున్న గునవి ప్రకటించుటయే కాక నీతిశాస్త్రము, అర్థశాస్త్రము మున్నగు ప్రాచీన రాజనీతి, దండనీతి, గ్రంథములుకూడఁ బలికటించి ప్రాచీన హిందూదేశ చరిత్రరచనకు సాయపడుట యవసరమైన పనియే యైయున్నది. శుక్రనీతిసారాది గ్రంథములు మనపూర్వు లెట్లు దేశములఁ బరిపాలించిరో, దేశమునకుఁ బ్రజలకు, రాజునకు, నెట్టిసంబంధము గల చట్టము లుండెడివో వివరముగఁ దెలుపుచున్నవి. ఇట్లే యాంధ్రభాషయందుఁ బర భాషలయందున్న యపూర్వ గ్రంథమలఁ గాని, ప్రజల కందఱకుఁ దెలియు సులభవచన గ్రంథములు గాని, వ్రాసి ప్రకటించుటకుఁ బ్రయత్నింతుము. గ్రంథము చిన్న దైనను, విషయ మాంధ్ర ప్రబంధములోనిదైనను, శ్రీరాయలవారియందలి గౌరవముచేతను విషయగౌరవముచేత నిది ప్రధానగ్రంథముగఁ బ్రకటించితిమి. ముందుముందు కామందకీ యాదిగ్రంథములు భాషాంతరీకరణము లొనరించి మాచందాదారులకు సమర్పింపఁజూతుము. ఇట్లే శాంతిపర్వాంతర్గత భీమ్మనీతి "రా