Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వక్షరాక్షరపురుషులకన్న నుత్తమపురుషుండవు అమాయుండవు
మాయివి సగుణుండ నగుణుండవు జీవుండ వీశ్వరుండపు కార
ణాత్మకుండవు కార్యరూపుండవు సులభుండవు. అసులభుం
డవు. దూరస్థుండవు. నికటవర్తివి ధ్యేయుండవు ధ్యాతవు. స్త
వ్యుండవు స్తోతవు ఆవాఙ్మానసగోచరుండవు వేదాంతప్రతిస్థి
తంబును, ప్రకృతిలీనంబును నగుపరంబుకన్న బరుండవు మ
హేశ్వరుండవు. నీయాజ్ఞవలన నాదిత్యుం డుదయించు పవనుం
డు సంచరించు నింద్రాగ్నులు ప్రవర్తింతురు మృత్యువు బరుగులి
డు. నీయాజ్ఞదక్క తృణంబును జలింపదు. నీవు సర్వనియామ
కుండవు. నీమాయాప్రభావం బచింత్యం బనిర్వాచ్యంబు. దురత్య
యంబు. నీయందుఁ బ్రసన్నులగువారు నీమాయం గడుతురు. సర్వ
క్రతుభోక్తవు, సర్వకర్మఫలప్రదాతవు నగు నిన్ను యథార్థంబుగా
నెఱుంగజాలక యన్యదేవోపాస్తి గావించునకృతాత్ము లగువార
లపరిమితస్వర్గాదిభోగంబు లనుభవించి పునర్జననఖేదంబు నొందు
దు రిది యెఱింగి భవద్భక్తులు ఫలాకాంక్షులు గాక కర్తుత్వాభిమా
నంబు విడిచి యజ్ఞదానతపఃకర్మంబు లాచరించి భవదారాధనంబు
చేసి ముక్తి జెందుదురు. మహాత్ములు కొందఱు పూర్వజన్మకృతసుకృ
తపరిపాకంబువలన నిర్మలాంతఃకరణులై యాచార్యు నుపాసించి
శ్రద్ధాళు లై యింద్రియముల నిరోధించి తాత్పర్యంబునం బొదలుచు
మహావైరాగ్యంబు శోభిల్ల వివిక్తస్థలంబున సుఖాసీను లై సమాకా
యశిరోగ్రీవు లై నాసాగ్రంబు విలోకింపుచు విరసంబు విశుద్ధంబు
నగు హృత్పుండరీకంబున నచింత్యావ్యక్తవిశదామృతాదిమధ్యాం
తరహితవిశోకప్రశాంతశివస్వరూపుండ వైననిన్ను దీర్ఘకాల్పనే
రంతర్యంబులం జింతించి మహానందహ్రాదనిమగ్నతం జెంది
కృతార్థు లగుదురు. ధ్యానంబుల గొందఱు, జ్ఞానంబునం గొం
దఱు, కర్మయోగంబునం గొందఱు, సంకీర్తనస్మరణవద