Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చరభూతంబులు నీయందు జన్మించి వెండియు నీయంద యేకీభా
వంబుఁ జెందు అణువుకంటె నణుతరుండవు మహత్తుకన్న మహ
త్తరుండవు. దూరంబు నడచు నపాదుండవు సర్వంబు గ్రహించు న
పాణివి. శబ్దంబు విను నకర్ణుండవు. రూపంబుఁ జూచు నచక్షుండవు.
సర్వతః పాణిపాదుండవు సర్వతోక్షిశిరోముఖండవు సర్వత
శ్శ్రుతిమంతుఁడవు. సర్వంబు నావరించి యున్నవాఁడవు. నిత్యుం
డవు. సత్యుండవు నిష్కళుండవు. నిరంజనుండవు. నిర్లిప్తుండ
వు నిర్వికారుండవు నిర్వాణనిధివి నిస్తరంగబోధసముద్రుండ
వు. సచ్చిదానందఘనుండవు అమలుండ వజుండ వనఘుండవు.
సర్వభూతావయస్థితుండవు. గతివి. భర్తవు ప్రభుండవు సా
క్షిని నివాసంబవు. కర్తవు. ఘనుండవు. ఉన్నతుండవు. శరణం
బవు సుహృత్తవు నిర్హేతుకబంధుండవు దయాపరుండవు.
భూతభావనుండవు. సర్వవ్యాపివి సర్వాఢ్యుండవు సర్వభూ
తాంతరాత్మవు. కేవలుండవు నిర్గుణుండవు. షడ్గుణైశ్వర్యసంప
న్నుండవు. సనాతనుండవు. యోగిధ్యేయుండవు ద్వితీయవస్తు
శూన్యుండవు. ప్రత్యగాత్మవు. శ్రోతవ్యుండవు, ద్రష్టవ్యుం
డవు, మంతవ్యుండవు, విధిధ్యాసితివ్యుండవు. ప్రణవగమ్యుం
డవు. నీతత్వంబు బ్రహ్లాదు లెఱుంగరు. సూర్యచంద్రాగ్నిప్ర
కాశకంబు నీతేజంబు. సమస్తప్రపంచంబు నీస్థూలశరీరంబు.
నీనిశ్వాశంబులు వేదంబులు నీవు భూమియం దావేశించి భూ
తంబులు దాల్తువు. వైశ్వానరుండ వై ప్రాణంబ దేహం బాశ్ర
యించి ప్రాణాపానవాయుసమేతుండ వై చతుర్విధాన్నపచనంబు
సేతువు. రసాత్మకుండ వై సోమరూపంబున నోషధులం బోషిం
తువు. సూర్యుడు జగంబులు వెలింగింపుచు ప్రజోత్పాదనా
ర్థంబు వర్షింతువు. స్మృతిజ్ఞానాపోహనంబులు నీవలనం బొడము.
నీవ సకలోపనిషద్వేద్యుండవు. వేదాంతకర్తవు. వేదవేత్తవు. నీ