Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీకు నంజలిఁ గావింతు నిష్ఠతోడఁ
గరుణఁ జూడుము భువనేశ కలుషనాశ.

65


వ.

సోముం డి ట్లనియె.

66


క.

శూలికి గుణశాలికి ఫణి
మాలికి శశిమౌళికి న్సమంచితభసితో
ద్ధూళితునకుఁ బాలితది
క్పాలకులకు రామనాథభవునకు జేజే.

67


వ.

అగ్ని యి ట్లనియె.

68


మాలిని.

హరిహయముఖదిక్పాలావళీభర్మమౌళి
స్ఫురదురుమణితేజఃపుంజనీరాజితాంఘ్రిన్
తరుణశిశిరభానూత్తంసు దిగ్వాసు నీశున్
నిరతము మది నుంతు న్నిష్ఠతో రామనాథు.

69


వ.

వాయు వి ట్లనియె.

70


క.

హరునకు హరిరూపునకుం
బరమాత్మకు వ్యాఘ్రచర్మపటునకు రామే
శ్వరునకు నీకుఁ బ్రణామం
బురుకృపతో నా కభీష్ట మొసఁగుము రుద్రా.

71


వ.

బృహస్పతి యి ట్లనియె.

72


వ.

చింతాతీతాత్మునకు న
హంతాసాక్షికినిఁ బ్రత్యగద్వయున కుమా
కాంతునకు వందనంబులు
భ్రాంతినివృత్తికి నొనర్తు రామేశునకున్.

73

కందమిళితమణిగణనికరవృత్తము.

జలరుహభవనుతచరణకమల ని
ర్మలగుణమణిగణ మదనమదిహరా
వలయితవిషధర వరగిరినిలయా
నెలకొని కొలిచెద నిను మది నభవా.

74