| |
చున్నన న్నుద్ధరింపు మత్యూర్జితాంగ
వృషభరాజతురంగ రామేశలింగ.
| 46
|
| మ. |
జననవ్యాఘ్రము పాపసింహ మతిదుష్టవ్యాధిచోరంబు నా
శనసర్పాకుల మింద్రియాద్ధనగ మీర్ష్యాపర్ణముల్ బాల్యయౌ
వనకూపంబులభీతికంటకము దుర్వారోగ్రసంసారకా
ననముం జొచ్చితి ధర్మమార్గము జగన్నాథా కృపం జూపవే.
| 48
|
| శా. |
పాపం బెల్లెడఁ గూర్చి ఖేదము జనింపన్ యోనులం బుట్టి కుం
భీపాకాదిదురంతదుర్గతుల నొప్పిం జెంది యాపిమ్మటం
బాపోత్కృష్టనికృష్టయోనితతులం బల్మారు జన్మించి ని
త్యాపన్నత్వమునం గృశించితిమి దేవా మమ్ము రక్షింపవే.
| 50
|
| గీ. |
ఘోరగంభీరసంసారకూపగతుల
జడుల వివశుల దీనుల చపలమతుల
కడుననాథుల మమ్ము నీవు కరుణఁ జూచి
కావవే యీశ రామేశ గగనకేశ.
| 51
|
స్రగ్విణీమిళితభుజంగప్రయాతము
| |
హరా! భక్తమందార యాపన్నరక్షా
పరా ముక్తసంగాకృపా ముగ్ధచర్మాం
బరా శుక్తిముక్తాప్రభాశోభితాంగా
పరా వ్యక్తచినాత్రభావాపురీశా.
| 52
|
| క. |
రక్షింపుము కరుణార్ణవ
రక్షింపుము దీనపాల రాజకిరిటీ
రక్షింపుము భువనేశ్వర
రక్షింపుము మమ్ము దేవ రామేశ శివా.
| 53
|