Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

255

విమానము. అది రావణుని సొంత సౌధము. అది మహారాజుది కావున చాలా గొప్ప మేడ. హనుమంతుడు చూచిన దామేడనే. అది యర్థ యోజనము వెడల్పు, ఒక యోజనము పొడవును కలదై యుండెను.


"పుష్పాహ్వయం నామ విరాజమానం, రత్నప్రభాభిశ్చ వివర్ధమానం,
 వేశ్మోత్తమానామపి చోచ్చమానం మహాకపి స్తత్ర మహావిమానమ్.” - యు. 7-11


పుష్పకమను పేరుగల చాలా గొప్ప మేడను చూచెను. ఆ బంగ్లాలో విశాలమైన గదులుండెను. చుట్టును మైదానములు, తోటలు, నానావిధ పుష్పవృక్షములుండెను. అట్టి పెద్ద బంగ్లానే తర్వాత రామాయణమును పెంచి వ్రాసినవారు. ఆకాశములో సంచరించు విమా నముగా చేసి దానికి రెక్కలు పెట్టి అందలి చెట్లను చిత్తరువులుగా చేసి వేసినారు. వాల్మీకి రామాయణములోనే ఆది భాగమందిట్లున్నది:


“సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహశోభితాం”
                                              -బాల. స. 5, శ్లో. 16.


అయోధ్యా నగరము నానా రత్నములతో కూడినదియు “విమాన గృహముల” చేత నిండినదియునై యుండెను అని వర్ణించినారు. విమాన గృహమనగా రాజుల మేడలు అని యర్థము. “విమానోస్త్రీ దేవయానే సార్వభౌమిక సద్మని" (భాస్కర నిఘంటు) అని వ్యాఖ్యాతలందే నిరూపించినారు. విమానమనిన ఆకాశమును కొలుచునది అను నర్థము కూడా ఇచ్చుటచేత తర్వాతికాలమందు రామాయణమును పెంచినవారు విమానమునకు ఆకాశయానమని అర్థముచేసి వర్ణించిరి కాని పుష్పక విమానము అనునది రావణుని యుద్యాన భవనమను వర్ణనలను, రావణుడు గాడిదలతో లాగబడిన రథముపై సీతాపహరణార్థము వెళ్ళెనను వర్ణన