Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

రామాయణ విశేషములు


"రథై ర్యానై ర్విమానైశ్చ తథాహయగజై శ్సుభైః." సు. 4-27


రథములను, యానములను, విమానములను, హయగజములను చూచెను. రావణుని సైన్యమును వర్ణించుచోట ఈ మాటలున్నవి. విమాన ములు రథభేదములు. యానములెట్లో అట్లే విమానములును ఒక విధమైన రథములు. దక్షిణదేశములో వాస్తుశాస్త్రపరిభాషలో దేవాలయములపై నిర్మింపబడు గోపురములను విమానము లందురు. యానములపై అట్టి గోపురరూపమగు కప్పులుండినట్టివి విమానములై యుండును. అంతేకాని ఆ కాలములో ఆకాశయానము లుండెనని తలచుటకు వీలులేదు. ఆకాశములో విమానములో పోయినవాడు రావణుడొక్కడే. రావణునికి పది తలలు, లోకాతీత శక్తి మున్నగు విషయాలెన్నో వర్ణించినప్పుడు అతనికి ఆకాశయానమునుకూడ కల్పించుటలో కవిసృష్టిసామర్థ్యము కానవచ్చు చున్నది. దేవాలయగోపురములు సాధారణముగా ఏడంతస్తులు కలవిగా నుండును. హనుమంతుడు “స నికామం విమానేషు విషణ్ణః కామరూప ధృత్, విచచార” (సు. 6-1). విమానాలలో సీతను వెదకెను అని చెప్పుటలో ఏడంతస్తుల మేడలలో వెదకెను అని అర్థముకదా. సాధారణ ముగా రావణుడు పుష్పకవిమానమునెక్కి సంచరించుచుండెనని చెప్పుదురు. రావణుడు సీతను బలవంతముగా అపహరించు కొని వెళ్ళునప్పుడు సీతతో నిట్లు చెప్పెను:


"యస్య తత్పుష్పకం నామ విమానం కామగం శుభం”
                                                         -అర. 48-6.


"నేను కుబేరుని లంకను జయించి అతని పుష్పకవిమానమును లాగుకొంటిని. అది ఆకాశములో సంచరించును" అని చెప్పెను. .రామా యణాంతమందును రాముడు అదే పుష్పక విమానములో ఆకాశ మార్గములో అయోధ్యకు వెళ్ళెనని వర్ణించినారు. పుష్పక మనునది ఆకాశయానమగు విమానము కాదు. అది తొమ్మిదంతస్తుల మేడయైన