Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

251

పిశాచగణాలు మనుష్యాతీతులు కారని, వీరందరునూ ఆటవికులే యని నిర్ణయించువారికి రామాయణము గద్దలున్నూ మనుష్యులే యని తోచును. వారును ఆటవికులై యుందురు. క్రీస్తుశకము ఏడవశతాబ్ద మందు “గుద్దవాడి” విషయమనున దుండెను. కొమర్రాజు వెంకట లక్ష్మణ రావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవవర్మశాసనములో (భారతి. సం॥ 7-సం9 లో) గుద్దవాడి విషయము వచ్చినది. కొమర్రాజు వారును మల్లంపల్లి సోమశేఖరశర్మగారును అది యిప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రపురము తాలూకాయని నిర్ణయించిరి. దానినే పూర్వము గుద్రహారము (గుద్రవాడి) అనియు పిలిచి రన్నారు. గుద్ర శబ్దాన్ని సంస్కృతములో గృధ్రగామార్చి గద్దలనుగా తర్వాత రామాయ ణాన్ని పెంచినవారు కల్పించినట్లూహింపవలెను. (వీరు నేటి జటాపు లనబడే గిరిజనులు కావలెను).

రాక్షసు లెవరు ?

ఇక రాక్షసు లెవ్వరో కనుగొందము. మొదట రామాయణములో వర్ణింపబడిన రాక్షసులనుగురించి తెలుసుకొందము. రామునికాలములో చిత్రకూటమునుండియే అనార్యులు వ్యాపించుకొనియుండిరి. దానికి దక్షిణమందే తాటకావనముండెను. తాటక రాక్షసికాదట! ఆమె యక్షిణి. ఆమెకు పుట్టిన మారీచుడైతే రాక్షసుడట! మరల యక్షుల మాట యెక్కడ కూడా కానరాదు. అమరుడు యక్షరక్షోజనులను చేర్చి చెప్పినాడు. మన తెనుగుదేశములో జక్కులవారు అని యిప్పటికినీ కలరు. వారే యక్షులు. యక్షజాతితో రాక్షసులు భిన్నించినవారుగా కనబడుచున్నారు. వారు వింధ్యకు దక్షిణముననే యుండియుందురు.


“తయో ర్మధ్యే ప్రవృత్తో౽భూత్ యజ్ఞస్సపురుషోత్తమ,
 సహ్లి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞ కర్మణి”. (బా. 39-5)