రామాయణ విశేషములు
247
సవర, కోదుజాతులవారున్నారు. కావున లాంగుల్యా నదీప్రాంతజనులను లాంగూలము కలవారనియు వారు కోతులనియు తర్వాత రామాయణ మును పెంచినవారు భావించియుందురు. శబరి యుండు ప్రాంతమందే సవరులున్నారు. సవరలకు సజాతీయులైన లాంగుల్యానదీ ప్రాంత వాసులగు ఆదిమాటవిక నివాసులు వానరులై యుందురు (లాంగుల్యానది నిప్పుడు నాగావళియందురు).
హనుమంతుని పెండ్లి
సాధారణముగా హనుమంతుడు నిత్యబ్రహ్మచారి యని అందరును భావింతురు. వాల్మీకి రామాయణములో హనుమంతుని పెండ్లి లేదా భార్యముచ్చట లేదని తలచి యీ ప్రవాదము కలిగినదేమో? అట్లైతే, నీలుడు మొదలగు బహువానరవీరుల భార్యలసంగతికూడా తెలుపలేదు. వారందరును నిత్యబ్రహ్మచారులా? హనుమంతుడు బ్రహ్మచారికాడు. అతడు వివాహితుడు. పైగా బహుభార్యలు కలిగియుండినట్టివాడు. ఏమి ప్రమాణ మందురా? వాల్మీకి రామాయణమే ప్రమాణము. రాముడు అయోధ్యకు వచ్చుచున్నాడని హనుమంతుడు ముందుగాపోయి భరతునితో తెలుపగా అతడు అధికానంద భరితుడై యిట్లనెను:
"ప్రియాఖ్యానస్య తే సౌమ్య దదామి బ్రువతః ప్రియం, సుకుం డలా శ్శుభాచారా భార్యాః కన్యాశ్చ షోడశ, హేమవర్ణా స్సునాసోరూ శశిసౌమ్యాననాః స్త్రీయః సర్వాభరణ సంపన్నాః కులజాతిభిః" (యుద్ధ. 128-42,44)
"ఓయీ, హనుమంతుడా! ప్రియమైనవార్తను నాకు తెలిపినందులకు నీకు మంచి కుండలములు కలవారును, మంచి ఆచారములు కలవారును, అందమైనవారును, చక్కని ముక్కు, చక్కని తొడలు కల వారును, చందమామవంటి ముఖములు కలవారును, సమస్త భూషణ భూషితలైన