246
రామాయణ విశేషములు
పరీక్ష తీసుకొని తృప్తిపడెను. సుగ్రీవునికి పట్టాభిషేకము చేసినప్పుడు అతనికి అడవిపంది తోలుతో చేసిన చెప్పులను దొడిగించిరి. ఆర్యరాజులకు జరుగు పద్ధతిగానే పట్టాభిషేకము చేసిరి. బ్రాహ్మణులు వేదమంత్రము లతో నతనికి పట్టము కట్టిరి. కిష్కింధలో బ్రాహ్మణు లెక్కడినుండి వచ్చిరి? అప్పటికే ఆర్యులు కొందరు అచ్చట నివసించియుండి రనవలెను. కోతులకు ఇండ్ల యవసరము లేదు కదా! కిష్కింధానగరము మంచి నాగరికత పొందినట్టిది. అందు తెల్లని మేడలుండెను (కి. 33-12). వారికి ఇనుము, బంగారు మున్నగు లోహముల ఉపయోగము తెలిసి యుండెను (కి. 33–16,17). వెండినికూడా వారుపయోగించుచుండిరి. (కి. 33–19). వారు వీణావాద్యసంగీతము లెరిగియుండిరి (కి. 33-21). కోతియందము మనకు తెలిసినదే! మరి కిష్కింధా వానరస్త్రీలు 'రూప యౌవనగర్వితలు.' సుగ్రీవుని సేవకులు ఉత్తమ వస్త్రములను కట్టుకొని యుండిరి (కి. 33-23). వానర స్త్రీలు నూపురములు, మొలనూళ్ళు మున్నగు ఆభరణములు ధరించియుండిరి (కి. 33-24). సుగ్రీవుడును, తారయు బాగా మద్యపానముచేసి మత్తులై యుండిరి (కి. 33-37,45). సీతజాడను కనుగొనివచ్చిన వానరులు సుగ్రీవుని మధువనమంతయు ధ్వంసముచేసి చెడద్రాగిరి.
వానరులకు రాక్షసులకును అంతగా భేదము లేనట్లున్నది. రావణుడు సుగ్రీవునికిట్లు చెప్పిపంపెను:
న కశ్చి దర్థ స్తవ నాస్త్యనర్థ స్తథాహి మే భ్రాతృసమో హరీశ!
-యు. 20-11.
"సుగ్రీవా! నీవు సత్కుల ప్రసూతుడవు. ఋక్షరజసుని
కుమారుడవైనందున నీవు నాకు తమ్మునితో సమానుడవు.” వానరులు
వింధ్యకు దక్షిణముననుండిన అనార్యులనియే నా విశ్వాసము. వారు
కోతులు కారు. కళింగములో లాంగుల్యా అను నది కలదు. అచ్చటనే