240
రామాయణ విశేషములు
10
వానర రాక్షస తత్త్వము
మన పురాణాలలో సాధారణముగా అన్నింటను రాక్షసులు కాన
వచ్చుచున్నారు. రామాయణములో రాక్షసులతోపాటు వానరులు కాన
వచ్చుచున్నారు. ఒక ఎలుగుబంటి, మూడు పక్షులు (గరుడ జటాయు
సంపాతులు), తాటకవంటి యక్షిణి కానవచ్చుచున్నారు. పురాణాలలో
పైవారేకాక కిన్నర, గంధర్వ, అప్సర, నాగ మున్నగు విచిత్రజాతులు
వర్ణింపబడినవి. ఈ వర్గములవారు మనుష్యులకు భిన్నించిన వారును,
మనుష్యాతీతశక్తి కలవారును, మాయారూపులును, ఆకాశగాములునై
యున్నారని తెలిపినారు. హిందువులలో బహుళ సంఖ్యాకులు వీటిని
నమ్ముచున్నారు. ఈ పేరులు గల జాతు లుండెనని నేను విశ్వసింతును.
కాని, వారు మనవంటి మనుష్యులే యనియు, వారికిని మనకును ఏమియు
భేదము లేకుండెననియు తలతును. ఆది పౌరాణికులకు వీరి నిజతత్త్వము
తెలిసి యుండెను. ఆర్యులకు మధ్య ఏషియాలోను ఏషియా మైనరు
లోను, హిందూస్థానమందలి దక్షిణాపథమందును, తూర్పున బర్మా
మలయాలోను, జవా బోర్నియో బలి సుమిత్రా ద్వీపాలలో తమతో
భిన్నించిన ఆచార వ్యవహార విశ్వాసములు కల జాతులు కనిపించినారు.
పలుమారు వీరితో ఆర్యులకు సంఘర్షణలుకూడా జరిగెను. అందుచేత
తమ కనుకూలురైన వారిని నిందించక మంచివారని వర్ణించిరి.
తమకు ప్రతికూలురైన వారికి ఘోర రూపములనిచ్చి వారిని దూషించిరి.
తర్వాత పౌరాణికులకిది తెలియక తమ యూహబలము కొలది వీరిని
వర్ణించిరి. వీరికి రెండుచేతులకు మారుగా అనేక హస్తములను ప్రసా
దించిరి. ఒక తలకు మారుగా మూడు తలలు, పది తలలు పెట్టిరి.