Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

రామాయణ విశేషములు

లన్నియు పతంజలికి చాలా తర్వాతివనుట స్పష్టమే. సారాంశమేమన ఆర్యులు మొదట క కేసస్ పర్వతాలనుండి సింధువరకుండిరి. తర్వాత మీడులతో, అక్కడులతో (Accadians), ఫ్రిజియావారితో, ఈరానీలతో వేరుపడి హిందూస్థానమందే నివసించిరి.

శ్రీరాముని కాలములో ప్రయాగ, మరియు దానికి 10 కోసుల దూరములోనుండిన చిత్రకూటము, తర్వాత అనార్యదేశము ప్రారంభ మగుచుండెను. చిత్రకూటమునుండి దండకారణ్యము, జనస్థానము, యక్షులు అనగా అనార్యులగు జక్కులవారు నివసించు తాటకావనము, ఇంకనూ దక్షిణములోను, తూర్పులోను అనగా ఇప్పటి ఒరిస్సా రాష్ట్రములో నుండు ముండాజాతి పూర్వికులగు వానరులు, రాక్షసులు అనబడు అనార్య జాతివారును, ఇంకను దక్షిణములో శబరికులము వారగు సవర జాతివారును, కిష్కింధలో వానర లేక “హరి" జాతివారుగు ఆటవికు లును, వారికి దక్షిణములో ఇప్పటి తమిళనాడులో రావణవర్గమువారగు రాక్షసులు నివసించినట్లు నే నూహించుచున్నాను. అనార్యులను సంస్క రించి, ఆర్యుల వలసలకు దేశమును యోగ్యముగాచేయుటకు నేటి క్రైస్తవ మిషనరీలవలె అత్రి, అగస్త్యుడు మున్నగు మునులు జనస్థానములో ఆశ్రమములను ఏర్పాటుచేసుకొని యుండిరి.

గుఱ్ఱము లేదేశములనుండి అయోధ్యకు వచ్చెడివో యిట్లు తెలిపి నారు:


“కాంభోజ విషయే జాతై బాహ్లికైశ్చా హయోత్తమైః
వనాయుజైర్నదీ జైశ్చ పూర్ణాహరి హయోత్తమైః" (బాల. 6-22)


కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధుదేశాలనుండి ఉత్తమాశ్వములు అయోధ్యకు దిగుమతి యగుచుండెనని తెలిపినారు. కాంభోజము ఇప్పటి ఆఫ్గనిస్థానమనియు, బాహ్లికమిప్పటి ఈరాన్‌లోని బలఖ్ అనియు తెలిపి నాను. వనాయువనగా అరేబియా దేశమని నందలాలన్నాడు. కాని