236
రామాయణ విశేషములు
దాటెనని రామాయణములోనే కలదు అయితే అది చాల పడమరగా నున్నది, తుదకీ శరావతి యెచ్చటనున్నదో నిర్ణయము కాలేదు.
ఇక నేను నా సొంతముగా ఒక ఊహ నిత్తును. అది ఎవ్వరునూ ఒప్పుకొననట్టిదిగా నుండును. ఇట్టి అజ్ఞాత విషయములలో మంచివో చెడ్డవో ఊహలు చేసిన భావి పరిశోధకులు తుది నిర్ణయమునకు రాగలరు. శరావతి భారతవర్షము లోనిదిగా నుండియుండును. కాని హిందూస్థానము హద్దులలో కాక యితర దేశములలోనిదైయుండును. జడ్. ఏ రగోజిన్ రచితమైన ఖాల్డియా అను గ్రంథములో ఒక వాక్య మిట్లున్నది: "Tigris was named in the ancient Languages as "the arrow from the swiftness of the current " టైగ్రీసునది ప్రచండవేగముతో ప్రవహించుట చేత దానిని శరము (బాణము) అని యనిరి. అది పర్ష్యా ఖాతములోనికి ప్రవహించును. అదియే శరావతీనదియై యుండును. (శరశబ్దము పుల్లింగముకాన శరవతికాక శరావతి యెట్లగునని పాణినీయులు తగవున కెగబడుదురు. శబ్దసామ్య చర్చలో అది యప్రధానము.) శరావతి అను చిన్ననది మైసూరు సంస్థానములో కలదని తెలియవచ్చినది. దాని నుండియే జోగ్ జలపాతము (water fall) కలదు అచ్చట జల విద్యుత్తును మైసూరు ప్రభుత్వమువారు నిర్మించినారు. అదొక చిన్న ఉపనదికదా! ఏ మాత్రమున్నూ భూగోళ ప్రఖ్యాతిలేని నదిని అమరుడు ఒక ఖండముయొక్క హద్దుగా నిర్మించికొని యుండునా ?
కాళిదాసుని రఘువంశమందలి రామాయణ కథలో 15 వ సర్గ ములో రాముడు తన నిర్యాణసమయములో కుశునికి కుశావతిని, లవునికి శరావతిని ఇచ్చిపోయెనని కలదు దానిపై నందార్గికర్ పండితుడు ఇట్లు వ్యాఖ్యానించెను: “ఉత్తరకోసలలోని శ్రావస్తియే శరావతి యందురు. మత్స్య పురాణములో 'గండ' అను జిల్లాలోని నేటి 'గండ' యే శరావతియందురు. అయోధ్యకుత్తరముననున్న నేటి సాహేత్ మాహేత్