Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

రామాయణ విశేషములు

వెస్టా (చంధో౽అవస్థా) గ్రంథములో ఆర్యదేశము చెప్పబడినది. నేటి పర్ష్యాలోని హీరట్ నగరము చుట్టునుండు మండల మంతయు ఆర్యాణ మనియు అదే ఆర్యభాషల కేంద్రమనియు ప్రాచీనులు చెప్పుకొనిరి."[1]రగోజిన్ గ్రంథములో ఇట్లున్నది: "ప్రాచీనములో బాక్ట్రియాను ఆర్యాణము (Ariana) అని పిలుచుచుండిరి. అదే ఏరాన్ (Eran) తుదకు ఈరాన్ (Iran) అయ్యెను. వీరిలో మొట్టమొదట ప్రసిద్ధినొందినవారు మీడులు. వారినే బైబిల్‌లో మాదాయ (Madai) జాతి అని వ్యవహరించిరి."[2] ఆర్మీనియా యనునది ఆర్యదేశమే. అందు జంద్ ఆర్యులుండిరి. ఇప్పటి త్రేస్ దేశాన్ని పూర్వము ఆర్య (Aria) దేశమనిపిలిచిరి. ప్రాచీన ఐరిష్ భాషలో ఐరీ (Aire) అనిన రాజపురుషుడు. ఐర్-లెండ్-ఐర్ దేశము అనగా ఆర్య దేశము. గ్రీకుభాషలో ఆర్యన్ అనిన ఉత్తమత్వము. మండాలు (Mandas) అను జాతి తామార్యులమని చెప్పుకొని పశ్చిమపర్షియాలో క్రీ. పూ. 2500 ప్రాంతములో నివసించిరి.

ప్రాచీనార్యుల యాదిస్థానమునుగూర్చి పాశ్చాత్య పరిశోధకులు మధ్యఏషియాయనియు, ఈరాననియు, కాస్పియన్ ప్రాంతమనియు, రష్యా మధ్య దక్షిణభాగాలనియు, ఆల్టాయి పర్వతోత్తర భాగాలనియు, బహుముఖముల తర్కించినారుకాని ఆర్యులు మొదట హిందూస్థానమువారు కారని యందరును అంగీకరించినారు. యూరోపులోని బ్రెస్లో (Breslau) వాసులగు “ప్రొఫెసర్ స్క్రోడర్ (Schrader) అనువారిదిప్పుడు తుదినిర్ణయము (latest theory). అదేమన ఆర్యులు వాల్గానదీ ముఖప్రాంత మందును కాస్పియన్ సముద్రో త్తర తీరములందును మొట్టమొదట నుండి నట్టివారు.”[3]

  1. Prehistoric India by P. Mitra
  2. Z A. Ragozin's Assyria
  3. Taraporewala - Elements of the Science of language P. 232.