Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

229

ద్రము - ఈ నాల్గింటిమధ్యనున్న దేశమును స్ట్రాబో (అను ప్రాచీన చరిత్రకారుడు) ఆర్యాణ (Ariana) దేశమనిచెప్పెను అట్టి ఆర్యాణమునకు బాక్ట్రియా (Bactria) తిలకాయమానమగు మండలమనియు చెప్పెను. (క్రీస్తునకుపూర్వము చాలా శతాబ్దములకు ముందుండిన) హేరొడోటస్ కంటె ఇంకనూ పూర్వికుడైన హెల్లామియస్ అనునతడు ఇప్పటి పర్ష్యాను ఆర్యదేశము (Aria) అని పేర్కొనెను. ఎలమైస్ (Elymais) అను పదము ఐలమ (ailama) నుండియు, అదియు ఐర్యాణనుండియు ఏర్పడెను."[1]ఇంకను మాక్సుమూలర్ గారిట్లు వ్రాసిరి: "పారశీకులు, బాక్ట్రియావారు' మీడులు, సగ్దియావారు స్ట్రాబో కాలమువరకు ఒకే భాషను మాట్లాడు చుండిరి. తురాన్ జాతికి వీరు భిన్నులై తామందరును ఒకేజాతి వారమని చెప్పికొనిరి. దరయన్ (దారా) పర్ష్యా చక్రవర్తి తన శాసనములలో తాను ఆర్యజాతివాడనని వ్రాయించుకొనెను. క కేసస్ కనుమలలో ఒసెట్టి (Ossetti) అను జాతి ఆర్యభాషను మాట్లాడుచున్నది. వారు తమను ఐరను (Iron) జాతిగా చెప్పుకొనుచున్నారు".[2] మరల పై పండితుడిట్లు వ్రాసినాడు-“క కేసస్ పర్వతాలపొడవునను ఆక్సన్, జక్సార్టీస్, నదులుపారు ప్రాంతాలలోను ఆర్య, అనార్యజాతులు రెండును కలగలుపు అగుచూవచ్చెను. తుర్వసుడును, అతని సంతతి వారును తురానులైరి. ఆక్సన్ నదికి (పశ్చిమముగా) బహుదూరము వరకును ఆర్యులుండిరి. హిర్కేనియా ప్రాంతములో అరికీ అనుజాతియు, అంతర్యాని అనునదియు కలవు. జర్జీస్ కాలములోని ఒక రాజు అరిపితస్ (ఆర్యపతి)అని వ్యవహరింపబడెను. థ్రేస్ దేశము ఆర్య (Aria) అని పిలువబడు చుండెను. విశ్చులా నదివద్ద ఒక జర్మను జాతి అరియై (Arii) అని పిలువబడుచుండెను.[3] పంచానన మిత్రగారిట్లు వ్రాసినారు: “జంద

  1. Maxmuller - Science of Language, Vol I, P 295
  2. Maxmuller - Science of Language, Vol I, P 296
  3. Maxmuller - Science of Language, Vol I, P 297