220
రామాయణ విశేషములు
యుండెడి దిక్కునెరిగి మహేంద్ర పర్వతమునకు బోయిరి. ఆ మహేంద్ర గిరి సముద్రతీరమందున్నది. కాని అది కిష్కింధకు దక్షిణమునగాక తూర్పుననున్నది ఇప్పటి ఒరిస్సారాష్ట్రములో అదియున్నది. తూర్పుగట్లు అను పేరుగల యీస్టరన్ ఘాట్లకు అది మకుటాయమాన మహీధరము. మహేంద్రగిరి అయోధ్యకు దక్షిణమున నున్నదని సరిపెట్టుకొని ముందుకు సాగుదము. అక్కడినుండి 100 యోజనముల దూరములో దక్షిణపుదిక్కుగా లంక కలదని రామాయణములో వర్ణించినారు. ఒరిస్సా లోని మహేంద్రగిరి నుండి యప్పటి సింహళము ఇంచుమించు 100 యోజన ములు అనగా 800 మైళ్ళుండును. కాని రామేశ్వరమువద్ద దీనిని చేరుటకు వీలైయుండగా 100 యోజనములు ఒకే దుముకుతో ఆకాశములో ఎగిరి హనుమంతునికి పోవలసివచ్చిన శ్రమ యెందుకు కలిగెను? మహేంద్ర గిరికిని లంకకును మధ్య భూభాగమే లేనట్లును ఒకే అగాధమగు సముద్ర మున్నట్లును వర్ణించినారుకదా! ఆ లెక్కచొప్పున దక్షిణమునకు మారుగా మహేంద్రగిరికి తూర్పుదిక్కుననే చాలా దూరమువరకు సముద్ర మున్నది. అట్లు వెళ్ళినచో మహేంద్రగిరినుండి ఇంచుమించు 600 మైళ్ల దూరమున అండమాన్ దీవులును, నికోబార్ దీవులును ఉన్నవి.
ఆ దీవులలో మనుష్యులను తినువారును క్రూరులును అనాగరికు లును ఆటవికులును అగు నివాసులున్నారు. నిజమేకాని ఆ దీవులలో రావణాదుల రాజ్యముండినట్లుకాని, వాటికి లంకలు అను పేరు లుండినట్లు కాని, నాగరికత చెందినవిగా నుండినట్లుకాని కానరాదు.
శ్రీరాముడు సుగ్రీవ హనుమత్సమేతముగా వానర సైన్యముతో లంకపై దండెత్తి నప్పుడు కిష్కింధనుండి మహేంద్రగిరికి ఒక్కదినములో ప్రయాణము చేసెనని రామాయణములో వర్ణించినారు. ఒక్కదిన ప్రయా ణము పొసగదు. పొసగునని యనుకొందముగాక ఒక్కదిన ప్రయా ణము దూరములోనున్న మహేంద్రగిరికి 100 యోజనముల దూరమున