రామాయణ విశేషములు
207
విమర్శ
వాల్మీకికి తెలియవచ్చిన ప్రపంచపు నాలుగు దిక్కులలోని దేశ పర్వతనదుల వివరమీ విధముగా నున్నది. అయితే అదంతయు సరిగా ఉన్నదని చెప్పుటకు వీలులేదు. క్రీ. పూ. 350 ప్రాంతాలలో గ్రీకులకు సింధునదికి తూర్పున ఇక ప్రపంచమే లేదను భావనయుండెను అందు చేత అంతకన్న చాల ప్రాచీనుడైన వాల్మీకికి ఇతర దేశముల సంగతులును బాగుగా తెలియకుండిన అది తప్పుకాదు నేను మొదలే తెలిపినట్లుగా ఇప్పుడు ప్రాచీన దేశాదినామములు మారిపోయినవి. అయినను కొన్నిమాత్ర మింకను గుర్తించి యూహించవచ్చును. వాల్మీకి చూపించిన వాటిలో కొన్ని అస్తవ్యస్తమైనవి. కొన్ని రెండుమూడు దిక్కులలో ఉండినట్లు తెలిపినాడు. తూర్పున పుండ్ర, వంగదేశంబు లున్నవన్నాడు. మరల అవే పుండ్ర, వంగ దేశములు దక్షిణములోను ఉన్నవన్నాడు. బాలకాండములో తెలిపిన అంగదేశమిచ్చటలేదు. దక్షిణములోని పుండ్ర దేశము ఓఢ్రదేశమై యుండవచ్చును. ఎందుకనగా దాని వెంటనే ఆంధ్ర దేశము పేరుచెప్పినాడు. అవంతిని దక్షిణములోను, పడమటను ఉండినట్లు తెలిపినాడు. బాహ్లిక, ఋక్షదేశములు రెండు దిక్కులలోను ఉదాహరింపబడినవి.
ఇక మనకు ఇప్పుడు అర్థముకాని దేశసముద్ర ద్వీపాదులను గురించి ఆలోచింతము. మన ప్రాచీనులు, వ్యాపారము చేయుటకై సముద్రముమీద ఇతర దేశములకువెళ్ళి అచ్చటి విశేషములను కథలుగా పెంచి మనదేశమువారికి వర్ణించియుందురు. మరియు ఇతర విదేశముల పేరులను మనవారికి తెలుపగా వాటికి సమానధ్వనిగల సంస్కృత నామములను మనవారు వాడియుందురు. ఇక్షుక్షీర ఘృతదధి సముద్రాలిట్టివే. ఈనాటివరకు మన పల్లెలలో మళయాళమును ఆడు మండల రాజ్య మని ఎన్నియో కథలు, కల్లలు అల్లి వర్ణించుటను మనము విను