Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

139

భరతునడిగెను. ఈ సుధన్వుడెవడు? రామాదులకు ధనుర్విద్యాగురువు విశ్వామిత్రుడొక్కడేయని తెలిపినారు కాని ఇంతకు పూర్వము కాని ఈ శ్లోకానికి పరమందుకాని ఈ సుధన్వుని జాడలేదు. ధనుర్విద్యలో మంచి నేర్పరియగువాడు సుధన్వుడని శబ్దార్థముండుటచేత అది నామవాచకము కాదని తలపవచ్చును. కాని అతడుపాధ్యాయుడనియు పేర్కొనుటలో అతడెవ్వడో తెలియవచ్చుటలేదు. కాని రామాదులు భార్గవ వంశము వాడగు విశ్వామిత్రునొద్దనే ధనుర్విద్యను నేర్చినటుల రామాయణమందు కలదు.

విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులను పంపుటకు దశరథుడు నిరాకరింపగా విశ్వామిత్రుని కాగ్రహము కలుగునని వసిష్ఠుడు తలచు టయేకాక అతడే ధనుర్విద్యకు తగిన గురువని ఇట్లు దశరథునితో చెప్పెను. "ఈ విశ్వామిత్రుడు ముల్లోకములం దెవ్వరును నెరుగని వివిధాస్త్ర ప్రయోగముల నెరిగినవాడు. దేవాసుర యక్షకిన్నరాదు లెవ్వరును నింతటి విద్యనెరుగరు. పూర్వము కృశాశ్వుడను నతని పుత్రులు పరమధార్మికులుండిరి. వారు సర్వాస్త్రములను పూర్వమే కౌశి కునికి (భార్గవవంశమువానికి) ఇచ్చియుండిరి. ఆ కృశాశ్వ పుత్రులు ప్రజాపతిసుతాసుతులు. వారు మహావీర్యులు. దీప్తిమంతులు. జయా వహులు. దక్షకన్యలైన జయయు, సుప్రభయు అస్త్రశస్త్రముల నూరిం టిని కనిపెట్టిరి......... ఆ శస్త్రములనుగూడ నీ కుశికాత్మజుడగు విశ్వామిత్రుడు నేర్చినాడు. ఇతడపూర్వములైన ధనుర్విద్యా విధానము లను సృష్టించగలవాడు. ఇతడు స్వయంసమర్థుడు. కాని నీ పుత్రుల హితార్థమే వచ్చినాడు. కాన బాలకులను పంపుడు" (బాల. 11. సర్గ, శ్లోకాలు 11 నుండి 21 వరకు).

పై వాక్యాలవలన కొన్ని విషయములు మనకు స్ఫురించుతున్నవి. ధనుర్విద్యలో మొదట కృశాశ్వ వంశమువారు ప్రవీణులు. అశ్వాంత నామ వాచ్యులందరును ప్రాచీనమునుండియు ఈరానీ ప్రభువులు. కావున