రామాయణ విశేషములు
129
'సువర్ణకోణాభిహతః ప్రాణద ద్యామదుందుభిః' (ఆయో. 81-2)
క్షత్రియులకు మృతాశౌచము 10 దినాలపాటు వర్తించుచుండెను.
(అయో. 76-23). కుండలు, స్థాలీలు, దొప్పలు, కరంభ్యములు (వెడల్పు
మూతలుగల పెద్ద పాత్రలు, కుంభ్యములు చిన్న కుండలు ఋష్యా
శ్రమములలో వాడబడుచుండెను. అయోధ్య 91 సర్గ 67 నుండి 80
వరకు శ్లోకాలు ఈ కాలములో పై వర్ణములవారు మట్టి పాత్రలను
హీనముగా జూతురు. వైదికాచారములకు మట్టి పాత్రలే పవిత్రమైనవి.
ఇప్పటికి వివాహములలో, అంత్యక్రియలలో కుండలనే వాడుదురు.
తెనాలి రామకృష్ణుని కాలములో బ్రాహ్మణుల యిండ్లలో కుండలు,
అటకలు మున్నగునవి వాడినట్లు పాండురంగ మాహాత్మ్యములో వర్ణించి
నాడు .
మిద్దెలనుండి వాననీరు పారుటకై దోనులను ప్రణాళి పెట్టు చుండిరి అంటే ఆ కాలమందలి యిండ్లకు మట్టిమిద్దెలుండెననియు వాటికి దోను లుండెననియు తెలియవచ్చుచున్నది. అయో. 62-10 ఈ కాలములో పాశ్చాత్యులు కనిపెట్టినామని చెప్పుకొను పరిపాలనతంత్ర ములో పురపాలక సంఘము లొకశాఖగా నున్నవి. అట్టి సంఘములందు వాడవాడకు కొందరు ప్రముఖులు ఎన్నుకొనబడినవారై సభ్యులుగా చేరి వాటిని పరిపాలింతురు. రామాయణ కాలమందు వృత్తులనుబట్టి నగరా లలో "శ్రేణులు" ఏర్పాటగుచుండెను. వాటిపక్షమున శ్రేణీముఖ్యులు ఎన్నుకొనబడుచుండిరి.
న త్వాం ప్రకృతయ స్సర్వా శ్రేణీముఖ్యాశ్చ భూషితాః
అనువ్రజితు మిచ్ఛంతి పౌరజానపదా స్తథా అయో. 26-14