రామాయణ విశేషములు
127
మాట పతంజలి యనంతరముదే యనవలెను. అట్లగుచో హనుమంతుడు సీతతో సంస్కృతముతో మాట్లాడుదునా వద్దా—
"యదివాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతామ్" అని తర్కించుకొనుటలో “సంస్కృత" పదమును వాడుటచే నీ శ్లోకము క్రీ. పూ. 300 తర్వాతనే ఎవ్వరిచేతనో రచితమై రామాయణమందు చేర్చ బడిన దనవలెను.
క్రీస్తు శకారంభమునుండి సంస్కృతము బ్రాహ్మణుల విశిష్ట పఠనభాషగా నుండినట్లు పై ప్రమాణాలు నిరూపించుచున్నవి. నాటకము లలో స్త్రీ శూద్రులకు సంస్కృతము నిషిద్ధమగుటయు నీ విషయమును దృఢపరచుచున్నది.
చాతుర్మాస్యప్రాముఖ్యము ఆనాటికే సిద్ధమై యుండెను. (కిష్కి 27-48) మణిశిలతో చేసిన తిలకమును నొసట జనులు ధరించు చుండినట్లు కానవచ్చుచున్నది (కి. 26-27) నగరాలలో జనులు జూద మాడుచుండిరి. (బా 5-16)
“చిత్రా మష్టాపదాకారం........."
అని వర్ణించినారు. ఇందు అష్టాపదం అంటే జూదమాడెడి పీట
అని వ్యాఖ్యాతలు వ్రాసినారు. ఈ పీట యెట్టిదో ఇదెట్టి జూదమో తెలుప
లేదు. ఇది చతురంగపు ఆట ఆడుపలక అని నే ననుకొంటాను.
చతురంగపుపీటలో 64 ఇండ్లు, ఎనిమిది పంక్తులు, ఒక్కొక్క పంక్తిలో
ఎనిమి దిండ్లు ఉండును. శబ్దకల్పద్రుమములో అష్టపదం అను పదాని
కిట్లర్థము వ్రాసినారు: “పంక్తౌ పంక్తౌ అష్టౌ పదాని యస్యేతివా.” కావున
ఇది చతురంగపు ఆట అని నేను భావించుచున్నాను. ఇది సరియగు ఊహ
యగుచో చతురంగ ప్రాచీనత ఇందు స్పష్టమగుచున్నది. చతురంగమునకు
భిన్నమై జూదముగా భావింపబడిన ఆటను అక్షము అనుచుండిరి. అది