Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

రామాయణ విశేషములు

వార్తికాలు క్రీ. పూ. 5 వ శతాబ్దానంతరమే ఏర్పడెను. హనుమంతుని కాలములో అవి లేకుండెను. కావున ఈ ప్రక్షిప్తాలమూలాన సుందర కాండలో అతడు సీతతో సంస్కృతములో మాట్లాడ జూచినమాట నమ్మ రానిదగుచున్నది. సంస్కృతమును జనులలో ముఖ్యముగా బ్రాహ్మణులు మాట్లాడుచుండి రనుటయు విశ్వాసయోగ్యము కాదు.

ఇల్వలుడు బ్రాహ్మణునివలె సంస్కృతములో మాట్లాడెనని అందు చేత ఆ కాలమందు బ్రాహ్మణులే సంస్కృతమందు మాట్లాడుచుండిరని గ్రహింపవచ్చును. కాని పతంజలికి పూర్వము అనగా క్రీ. పూ. 300 కంటే ముందుకాలములో శూద్రులుకూడా సంస్కృతమును మాట్లాడు చుండురనియో లేదా మాట్లాడితే అర్థము చేసుకొనుచుండిరనియో చెప్పక తప్పదు. “ప్రత్యభివాదే శూద్రే” (8-2-83) అను పాణిని సూత్రములో శూద్రులుకాని వర్ణత్రయము వారిని సంబోధించునపుడు ప్లుతము నుపయో గించ వలెనన్నారు. అందుపై పతంజలి మహర్షిగారిట్లన్నారు: "కుశల్యసి తుషజక ” తుషజక! (ఓరీ శూద్రా) నీవు కుశలివికదా అని తుషజకా! యనక హ్రస్వముగానే యుండవలెనని యుదాహరణ మిచ్చినారు. తుషజకునితో సంస్కృతముతో మాట్లాడితే వాడర్థముచేసుకొని సంస్కృ తములో ప్రత్యుత్తర మియ్యగల శూద్రుడే యనవలెను కదా! పతంజలికి పూర్వము శూద్రులకుకూడా సంస్కృతమువస్తే రామాయణ కాలములో అది వారి మాతృభాషయై యుండెనేమో? అట్లయినచో "ధారీయన్ బ్రాహ్మణం రూపమిల్వల సంస్కృతం వదన్" (అరణ్య. 11-58) అను శ్లోకభాగము ప్రక్షిప్త మనవలసివచ్చును ఇట్లనుటకు మరొక కారణము కూడా కలదు. పాణిన్యాచార్యులు తన సూత్రాలలో నంతటను వేదభాషను ఛందస్సు అనియు తదితరమగు గీర్వాణభాషను “భాష” యనియు వ్రాసినారు. అష్టాధ్యాయిలో “సంస్కృతము” అను పదమెందును కాన రాదు. తుదకు క్రీ. పూ. 300 ప్రాంతము నందుండిన పతంజలికూడా సంస్కృత శబ్దమును వాడినటుల కానరాదు. కాన సంస్కృతభాష అను