Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

125

ఆ మాటల నూరకనే నమ్మి నోరుమూసుకొని వెళ్ళిపోదురా? అయితే ఈ యాచారము క్రమముగా భారతీయార్యులు వదలుకొని రనియు, ఈరానీ జరథుస్త్రానుయాయులు మాత్రము దానిని వదలుకొనలేదనియు దీనివలన ఊహించవచ్చును. రాక్షసులు శవాలను పూడ్చుచుండిరని రామాయణమందు తెలిపినారు.

భాద్రపదమాసము వేదాధ్యయనమునకు ఉత్తమకాలముగా పరిగ ణింపబడుచుండెను. (కి. 28-54) ప్రయాణములు చేయునప్పుడు సైనికులు ఏనుగులలద్దితో చలిమంటలు కాపుకొనుచుండిరి. (అయో. 99-7) బ్రాహ్మ ణులు బహుళముగా సంస్కృతమునే మాట్లాడుచుండిరని పలుతావులందు తెలుపబడినది. వాతాపిసోదరులు బ్రాహ్మణవేషముతో సంస్కృతములో మాట్లాడి జనులను మోసగించుచుండిరి (ఆర. 11-57) హనుమంతుడు సీతను మొదటిసారిగా చూచినప్పుడు తా నామెతో బ్రాహ్మణులవలె సంస్కృతములో మాట్లాడవలెనా యని తనలో వితర్కించుకొనెను. (సుం. 30-18) హనుమంతుడు గొప్పవిద్వాంసుడనియు వైయాకరణి యనియు, ఉ త్తరకాండలో వర్ణించినారు.


అసౌ పునర్వ్యాకరణం గ్రహిష్యన్.............ఉత్తర. 36-45.
స సూత్రవృత్యర్థపదం మహార్థం ససంగ్రహం సాధ్యతివైకపీంద్రః
నహ్యస్యకశ్చి త్సదృశోస్తిశాస్త్రే వైశారదే ఛందగతౌ తథైవ
సర్వాసు విద్యాసు తపోవిధానే ప్రస్పర్ధతే......
                                                           (ఉత్తర. 36-46-47)


ఈ శ్లోకాలనుబట్టి హనుమంతుడు వ్యాకరణ సూత్రాలలోను, వార్తికములలోను, ఛందస్సులోను, శాస్త్రములందును, సకల విద్య లందును ప్రవీణుడని వర్ణించినారు. ఇట్టి వర్ణనవలన హనుమంతుని పాండిత్యవిషయములో అనుమానము కలుగుచున్నది. వ్యాకరణసూత్రాలు