రామాయణ విశేషములు
123
దాటుటకు పూర్వము తాను చేసియుండిన విడిదిని కాల్పించెను. (అయో. 89-15) ఈ యాచారము హిందూ రాజులలో విజయనగరసామ్రా జ్యాంతము వరకు వర్తించుచుండెనేమో? ఆముక్తమాల్యద, రాయ వాచకము మున్నగు విజయనగర చక్రవర్తులకాలపు వాఙ్మయములో రాజుల వెలిగుడారములను వర్ణించినారు. అచటినుండి చక్రవర్తులు ముందునకు సాగినపుడు వాటిని దహింపజేయుచుండిరని వర్ణించినారు.
రామాయణ కాలమందు వడ్డీవ్యాపారము జరుగుచుండెను. అందు బ్రాహ్మణులుకూడా చేరియుండిరి. వారి వ్యాపారానికి ప్రత్యేక సౌకర్య ముండెను. అది ఇతరవర్ణాలకు నిషిద్ధమై యుండెను. అప్పు తీసుకున్నవాడు దానిని చెల్లింపకుండిన అప్పిచ్చినబ్రాహ్మణుడు వాని యింటికడప కడ్డముగా తన ముఖమును కప్పుకొని భుజింపకుండా ప్రాయోపవేశముచేసి భూమిపై పండుకొనుచుండెను అప్పు చెల్లించువర కీ ప్రాయోపవేశము సాగుచుండెను. (ఆయో. 111-14)
మృత్యువాసన్నమైన వారికి బంగారుచెట్లు కనిపించునని జనులు విశ్వసించుచుండిరి. (ఆర. 47-37) స్త్రీలకు ఎడమ కన్నదిరితే మంచి దనియు, అదే పురుషులకు చెడ్డదనియు, పురుషులకు కుడిక న్నదిరిన మంచిదనియు, అదే స్త్రీలకు చెడ్డదనియు నమ్ముచుండిరి. (కి. 5-32) ఈ విశ్వాసము హిందువులలో నేటికిని కలదు. క్రొత్తగా గృహప్రవేశము చేయుటలో మేలుగోరినట్లైన కుడికాలు మొదట కడపలోనికి పెట్టవలెను. ఎడమకాలు పెట్టగూడదు. హనుమంతుడు లంకాద్వారమందు ప్రవేశించి నప్పుడు ఎడమకాలు ముందు పెట్టెను. లంకకు నాశనము కోరి అతడు బుద్ధిపూర్వకముగా అట్లు చేసెను. (సుం. 4-3) ఈ కుడి యెడమకాళ్ల విశ్వాసము ఇప్పటికినీ మనయందు కలదు. క్రొత్త యెద్దును కొన్న వ్యవసాయకులు ఎద్దు కుడికాలిని ప్రయత్న పూర్వకముగా కడప లోనికి పెట్టించి దాటింతురు. నూతన వధూవరులచే అత్తవారి యిండ్లలో