Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

111

కాదో అనుమానముగానే యున్నది. ఆమె మహాసౌందర్యవతిగా నుండి యుండును. పైగా చిన్నభార్య యనగా ముద్దుల భార్య. అందుచేత ఆమెకును తక్కిన యిద్దరితో సమానస్థానము లభించియుండును. ఆమె కట్టి యధికారము లభించునో లేదోయను అనుమానముచేతనే కాబోలు ఆమె తండ్రి దశరథుని యావద్రాజ్యమును ఓలిగా తీసుకొని ఆమె నిచ్చి పెండ్లి చేసెను. స్త్రీ శుల్కము ఆర్యధర్మములలో చేరినట్టిది కాదు. తన రాజ్యము నంతయు భార్యాశుల్కము క్రిందనే చెల్లించినందున కైకేయి, కేకయరాజు దిక్కునుండి భరతునికి రాజ్య మిప్పించు ప్రయత్నములు జరుగునని దశరథునికి ఒక దిక్కు అనుమానముండనే యుండెను. అందుచేతనే రామునితో ఇట్లనెను:


విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః
లావదేవాభిషేక స్తే ప్రాప్తకాలో మతో మమ. (అయో. 4-25)


భరతుడు ఇచ్చటికి వచ్చేలోపలనే నీ పట్టాభిషేకము కావలెను. భరతుడు మంచివాడే కాని కాల వైపరీత్యమువల్ల జనుల బుద్ధులు మారుచుండును (అయో. 4-26,27) అనియు చెప్పెను. బహుశః భరతుని అతని మేనమామ యింటికి పంపివేసినదికూడా ఈ అనుమానము చేతనే యేమో? పై శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. వాటినిబట్టి కైకేయి అంతటి కఠిన కాదనవలసియుండును. అరణ్యావాసప్రారంభమందే రాముడన్న శ్లోకాలున్నూ గమనింపదగినవి. అతడిట్లనెను:

"ఓయీ! లక్ష్మణా! ఈనాడు రాజు దుఃఖమందు మునిగినాడు. కైకేయీవశగుడై కామార్తుడై వృద్ధుడై మరేమి చేయగలడు? ధర్మార్థ కామములలో కామమే పైచేయికలదై పోయినదికదా! విద్యారహితుడైనను స్త్రీ కారణముగా అనుకూలుడగు కుమారుని త్యజించునా?" (ఆయో. 53-6 నుండి 10 వరకు). ఈ విషయాలను సమన్వయించిన దశరథుడు