Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

105

చెడ్డదనియు, దానికి మరణమే ప్రాయశ్చిత్తమనియు మనువు శాసించెను. సురకు శుక్రాచార్యుని శాపముకూడ కలదు. సౌవీరము ఆ పేరు గల గుజరాతు దేశమందు సిద్ధమగునట్టి మద్యమని యొకరు వ్రాసిరి. కాని వైద్య గ్రంథాలలో యవలతోను లేక గోధుమలతోను సిద్దమగు సారాయియే సౌవీరమన్నారు. సుర నిషిద్ధమద్యమనియు, సౌవీరము శిష్టులు త్రాగు సారాయి యనియు సీతాదేవి యభిప్రాయము. కాని సీతాదేవియే అరణ్యా నికి వెళ్ళునప్పుడు "గంగమ్మా, మేము క్షేమముగా తిరిగివచ్చితిమా నీకు 'సురాఘట సహస్రమును' (ఆయో. 52-89) సమర్పించు కొందును"అని ప్రార్థించెను. సుర నింద్యమైనచో దానిని సీత యెట్లు నివేదించుకొనును! గంగ యెట్లు స్వీకరించును? ఇది స్పష్టమగుటలేదు.

భరద్వాజుడు భరతునికిని, అతని సైన్యమునకును మేకలు, పందులు, జింకలు, నెమళ్ళు, కోళ్ళు వీటియొక్క మాంసమును వండించి పెట్టెను. మద్యమాంసములు నింద్యములుగా నుండినచో భరద్వాజు నంతటి మహర్షి తన యాశ్రమములో వివిధ జంతుమాంసములను వండించి ఆరగింపజేసియుండడు. భరతుడు వచ్చుటకుముందు చిత్ర కూటమందు ఉన్నతశిఖరముపై సీతారాములు కూర్చునియుండిరి. అప్పుడు రాముడు సీతకు మాంసపు తునకలు నోటికందించి తినిపించు చుండెను. (ఆయో. 96-1).

ఇదం మేధ్యం, ఇదం స్వాదు, నిష్టప్తమిదమగ్నినా' (అయో. 96-2) 'ఇదిగో సీతా, ఈ మాంసఖండము పరిశుద్ధమైనది. ఈ తునక రుచికరమైనది. ఇదిగో ఈ చియ్య ముక్క అగ్నిలో బాగుగా కాలినది చూడు. ఇదొక్కటి తినుము' అని రాముడు ఆమెను బుజ్జగించుచు (ఛందయన్) మాంసము తినిపించుచు ఆమెకానందము కలిగించుచుండెను. రావణుడు సీతను అపహరించుటకై బ్రాహ్మణవేషముతో పంచవటికి వెళ్ళెను. అతడు నిజముగా బ్రాహ్మణుడేయని సీత తలచి అతనిని