Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

రామాయణ విశేషములు

తుష్టిపూర్తిగా మాంసము తినిపించుచుండిరి. అగస్త్యమహర్షియు ఒకమారు వారి శ్రాద్ధ భోజనములో మేకమాంసమును భుజించెను. ఆర. 11-66 దీనినిబట్టి మునులుకూడా ఎప్పుడు తప్పినను శ్రాద్ధములందైనను మాంసమును తినుచుండిరని ఊహింపవచ్చును.

గంగానది దాటునప్పుడు సీతాదేవి యిట్లని మ్రొక్కుకొనెను: “గంగాదేవీ, మేము సుఖముగా తిరిగి వచ్చినట్లైన నీకు 10,000 ఆవులను, 1000 సురాభాండములను మాంసాన్నమును సమర్పించు కొంటాను.” (అయో. 52-89). అదే విధముగా యమునానదిని దాటు నప్పుడును ఇట్లు మ్రొక్కుకొనెను: “మేము సుఖముగా తిరిగి వచ్చి నట్లైన నీకు 1000 ఆవులు 100 కల్లుకుండలు సమర్పించుకొందును" (అయో. 55-20).

రాముడు గంగదాటి అరణ్యమును ప్రవేశించిన మొదటిదినమే నాలుగు జంతువులను ఆహారార్థమై వేటాడెను.


తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్
వరాహ మృశ్యం పృషతం మహారురుం
ఆదాయ మేథ్యం త్వరితం బుభుక్షితౌ

వాసాయ కాలే యయతు ర్వనస్పతిమ్.

(అయో. 52-102)


సీతారామలక్ష్మణులు బాగా ఆకలికొనియుండిరి. అప్పుడు రాముడు పందిని, మనుబోతును, దుప్పిని, నల్లచారల దుప్పిని చంపెను. వాటి పరిశుద్ధమగు మాంసమును వారు భుజించిరి. యమునాతీరమందలి వనమును చేరినప్పుడు రామ లక్ష్మణులు -


బహూన్ మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతు ర్యమునావనే.

                                                   

(అయో. 55-98)