రామాయణ విశేషములు
87
జరిగెను. (యు 22-66 నుండి 71 వరకు) అష్టమినాడు సేతువు ముగి సెను. కావున ఫాల్గుణ బహుళ 9 నాడు యుద్ధ మారంభమైనది. అమా వాస్యనాడు రావణవధ జరిగెను. కావున 6 దినాలే యుద్ధము జరిగెను. ఫాల్గుణ కృష్ణ 14 నాడు రావణుని స్వయం యుద్ధోద్యమము అమావాస్య నాడును యుద్ధము చేయును. (యు. 93-65) ఆనాడే చచ్చును 14 ఏండ్లు గడువు రేపు పూర్తియగుననగా చైత్ర శు 5 నాడు రాముడు అయోధ్య కొక్క దిన ప్రయాణదూరములోనున్న భరద్వాజాశ్రమమును చేరును. యు. 127-1 చైత్ర శు 6 నాడు అయోధ్యా ప్రవేశము శు 7 నాడు పట్టాభిషేకము.
ఇవి రామాయణములోని ముఖ్యమగు తిథులు. అయితే ఇందు కొన్ని దురవగాహముగా కనబడుచున్నవి. లంకనుండి అయోధ్యకు రెండుదినాలలో విమానమందు ప్రయాణము చేసినది ఆధునికులు విశ్వసింపరు. ఆ కాలములో విమానము లుండెనా? క్రీ. శ. 12 వ శతాబ్దములో భోజుడను రాజు విమాన యంత్రములను చేసి నడిపించినట్లు “సమరాంగణము అను గ్రంథములో (బరోడాలో ముద్రితము) వ్రాసినాడు. కాని రామాయణ కాలములోకూడ ఒక పుష్పకవిమానము పేరు తప్పితే వేరే విమానాల చర్చయే కానరాదు.
కిష్కింధకు లంకకు ఒకేదిన ప్రమాణమని రామాయణములో తెలిపినారు. మన మిప్పుడనుకొను బళ్లారిలోని హంపియే కిష్కింధ యైనచో, ఇప్పటి సింహళమే లంకయైనచో ఒక దినములో ప్రయాణము అసంభవము అటైన లంక యెక్కడ యుండెను? అను ప్రశ్న బయలు దేరును. ఈ లెక్కనుబట్టి మనము సరిగా నిర్ణయించజాలము. ఈ చర్చ ముందు భౌగోళిక ప్రకరణములో చేయుదును.
ఈ కాలనిర్ణయచర్చను ప్రత్యేకముగా చేయవలసివచ్చెను. ఎందుకనగా హిందువు లాచరించుకొను పండుగలలో కొన్ని రామునికి