Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

రామాయణ విశేషములు

వ్యాఖ్యానించినాడు: "రాముడు చైత్రశుద్ధ 5 అయోధ్యను వదిలెను. అదే రాత్రి తమసాతీరమందు నిద్రించెను. షష్ఠినాడు శృంగిబేరపురమందును, సప్తమినాడు వృక్షమూలమునను శయనము. అష్టమినాడు భరద్వా జాశ్రమములో, నవమినాడు యమునాతీరమందు, దశమినాడు చిత్ర కూటము చేరెను. అదేరాత్రి అయోధ్యలో దశరథుడు చనిపోయెను. ఏకాదశినాడు దశరథశవాన్ని నూనెదోనెలో నుంచిరి. ద్వాదశినాడు భరతుని పిలుచుటకై దూతలు వెళ్ళి పౌర్ణమినాడు భరతుని కాంచిరి. చైత్ర బహుళ ప్రతిపత్తునాడు భరతుని ప్రయాణము చైత్ర బ 9 నాడు అయోధ్యను చేరెను. ఆనాడే దశరథుని సంస్కారము. ఆ నాటినుండి 13 వ దినమందు అనగా వైశాఖ శుద్ధ 5 నాడు భరతుడు శ్రాద్ధకర్మలను చేసెను. శుద్ధ 6 నాడు దహనదేశ శోధనము. సప్తమినాడు బాటలు బాగు చేయించును. నాలుగుదినాల తర్వాత 11 నాడు భరతుడు రామునివద్దకు ప్రయాణమగును. ద్వాదశినాడు భరద్వాజాశ్రమ మందు; త్రయోదశి నాడు రామ దర్శనము. మూడు దినాలు చిత్రకూటమందేయుండి వైశాఖ బహుళ విదియనాడు పాదుకలతో తిరిగిపోవును. చతుర్థినాడు అయోధ్య చేరును. ఈ విధముగా ఒకటిన్నర నెల గడచినతర్వాత రాముడు చిత్ర కూటమును వదలి అత్ర్యాశ్రమమును చేరును. వివిధ ఋష్యాశ్రమము లందు నివసించుచు 10 సంవత్సరాల కాలమును గడిపెను. మొత్తముపై 10 సంవత్సరాలపై ఒకటిన్నరమాసము గడిచినది. అప్పటినుండి 13 ఏండ్లు పూర్తియగువరకు పంచవటీతీర్థమందు నివసించెను. 14 వ సువత్సరారంభమందు చైత్రమాసములో రావణుడు సీతను అపహ రించెను. వైశాఖమందు రాముడు సుగ్రీవుని కలియును. ఆషాఢమందు వారి వధ. ఆశ్వయుజమందు సైన్యముల సమకూర్పు. ఫాల్గునమందు రాముని ప్రాయోపవేశము. ఫాల్గున శు 14 నాడు లంకాదహనము, ఫాల్గున అమావాస్యనాడు రావణ వధ. చైత్ర శు 1 నాడు రావణ సంస్కారము. విదియనాడు విభీషణాభిషేకము. తృతీయనాడు లంక