Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

81

మరి రాముడు అరణ్యానికి పోయిననాడు 25 ఏండ్లవాడని సీత చెప్పుచున్నది. అయితే కన్నతల్లి కౌసల్య రామునికి అరణ్యానికి వెళ్ళేకాలములో 17 ఏండ్ల వయస్సే అని చెప్పియుండెను కదా ! రాముని వయస్సువిషయములో తల్లి కెక్కువ తెలియునా? భార్య కెక్కుడుగా తెలియునా? తల్లిమాటయే ప్రధానమగును. అరణ్యానికి పోవుటకు 12 ఏండ్లకుముందు రాముని వివాహమైనందున ఈ లెక్కప్రకారము రామునికి వివాహకాలములో 5 ఏండ్ల వయస్సే యుండెను! అటైనచో "ఊన షోడశవర్షుడు" నా రాముడు అన్న తండ్రి దశరథునివాక్కు అబద్ధ మగును. రామునికే వివాహకాలమందు 5 ఏండ్లుండిన సీత కెన్ని ఏండ్లు? అత్తకోడండ్ర లెక్కల భేదమును వ్యాఖ్యాతలు సమన్వయింపవలసి వచ్చెను. వా రిట్లన్నారు. కౌసల్య అనిన 17 ఏండ్లు సరిగానే ఉన్నవి. సీత తెలిపిన 25 ఏండ్లు కూడ సరియైన లెక్కయే. ఎట్లనగా రాముడు పుట్టిననాటినుండి వయస్సులు లెక్కించవలసిన పనిలేదు. అతని ఉపనయనము క్షత్రియధర్మము ప్రకారము ఎనిమిదవయేట జరిగినందున ఆనాటినుండియే లెక్కించుకొని 17 అని సరిపెట్టుకుంటే చిక్కువదలి పోవును అని వ్యాఖ్యాతలన్నారు. అయితే సీత ఆ విధముగా ఎందుకు లెక్క పెట్టకపోయెనో తెలుపకపోయిరి! సమన్వయము ఎటుపట్టితే అటు చేయవచ్చును!! బుద్ధిచాకచక్యము కొలది సమన్వయము చేయవచ్చును. కాని ఒక విషయమును మాత్రము వ్యాఖ్యాతలు సరిపెట్టుటకు మఱచి పోయినారు. ఆదేమనగా, రామాదుల వివాహకాలములో కైకేయి తండ్రి తన మనుమడగు భరతుని చూడగోరినవాడై పిలుచుకొని వచ్చుటకు భరతుని మేనమామ నంపి యుండెను. అతడు అయోధ్యకు వచ్చి అచ్చట వారిని కానక మిథిలకు వెళ్ళి అచ్చటనే పెండ్లి సందడిలో ఉండి పోయెను. పెండ్లి అయిన తర్వాత అయోధ్య చేరిన వెంటనే భరత శత్రుఘ్నులను కైకేయి తండ్రియొక్క దేశానికి పంపిరి.. వారు మరల