రామాయణ విశేషములు
79
అశ్వినా వివ రూపేణ సముపస్థితయౌవనౌ. (బాల. 50-19)
“రామలక్ష్మణులు అశ్వినులవలె యౌవనము పొందిన వారై
యున్నారు.” యోవనారంభ దశలో నున్నారన్న ఏమి అర్థము? జనకుని
నగరానికి వెళ్ళిన కొన్ని దినాలలోపలనే రామసోదరులకు వివాహ
మయ్యెను. వెనువెంటనే వారు తమతమ భార్యలతో అయోధ్యానగరానికి
వెళ్ళిరి. ఆ భార్యలు-
రేమిరే ముదితా స్సర్వా భర్తృభి స్సహితా రహః. (బాల. 77-34)
“రహస్యమందు తమతమ భర్తలతో ఆనందముతో రమించిరి"
రాముడై తే-
రామస్తు సీతయాసార్థం విజహార బహూన్ ఋతూన్.
(బాల. 77-25)
సీతతో పెక్కు ఋతువులందు క్రీడించెను. ఈ విధముగా వర్ణిం
చుటచేత రామాదులు 20 ఏండ్లు దాటిన వయస్సు వారుగా నైనను
నుండియుందురని తలపవలసియుండును. సీతాదులును వ్యక్తురాండ్రై
యువతులుగా నుండిరని అర్థమగుచున్నది
సీతతో రమించుచు ఆనందించుచున్న రాముడు ఇంకను ఎట్టివాడో వాల్మీకి స్పష్టపరచినాడు.
అరోగస్తరుతో వాగ్మీ వపుష్మాన్ దేశకాలవిత్. (అయో. 1-18)
“అతడు రోగరహితుడు, ఆరోగ్యవంతుడు, మంచి వాక్చాతుర్య
మెరిగిన అనుభవశాలి. కాయపుష్టి కలిగిన అజానుబాహుడు. యౌవన
వంతుడు. దేశకాలములను బాగుగా ఎరిగినవాడు.” రాముని యౌవరాజ్య
పట్టాభిషేక సన్నాహములు వివాహమైన కొలది కాలములోపలనే జరిగెను.
వివాహమైన వెంటనే భరతుడు తన మేనమామ యింటికి వెళ్లెను. అతడు