Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

77

చేత రాముని పట్టాభిషేకము చైత్రశుద్ధ 7 నాడు జరిగినదనుట స్పష్టము. విషయమిట్లుండ వారి పట్టాభిషేకము శుద్ధ 9 నాడు జరిగినదని చాలమంది విశ్వసించుట కాధారమేమియు కానరాదు. శ్రీరామ నవరాత్రులను గురించి యింతకుమించిన విశేషములు రామాయణమందు కానరావు.

శ్రీరాముని వివాహముకూడ చైత్ర శుద్ధ 9 నాడు జరిగెనని యందురు. కాని దాని ఆధారము వాల్మీకి రామాయణమందు లేదు. ఉత్తరఫల్గునీ నక్షత్రమందు వివాహము జరిగెనని మాత్రము తెలియవచ్చు చున్నది. (బాల. 71-24 మరియు బాల. 72-12, 13.)

దశరథునకు శాంత అను ఔరసపుత్రి యుండెననియు ఆమెను ఆంగరాజగు రోమపాదునకు దత్తతగా ఇచ్చెననియు తెలిపినారు. (బాల. 9-18, 11–17.) శాంత దశరథుని కే భార్యయందు పుట్టెనో తెలుపలేదు. ఆ కాలములో కన్యకలను గూడా దత్తతగా ఇచ్చుచుండిరని చెప్పవలసి వచ్చును. దశరథునికి శాంత ఔరసపుత్రియని స్పష్టము గాలేదు. “సఖ్యం సంబంధకం చైవ" (బాల. 11-17) అనుదానికి వ్యాఖ్యాతలు స్నేహ సంబంధమో దూర బాంధవ్యమో అను సామాన్యార్థము చెప్పక శాంత దశరథుని పుత్రియని వ్యాఖ్యానించినారు. "శాంతా తవసులా" (బాల. 17-19) అని దశరథుడే స్వయముగా అంగరాజుతో అనెను. కావున శాంత దశరథుని పుత్రికయని చెప్పుటకు వీలులేదు.

రామాదుల జననానంతరము వారు పసివారుగా నుండగానే వారికి విశ్వామిత్రుడు స్వయంగురువుగా ఏర్పడెను. దశరథుడు రాముని విశ్వా మిత్రుని కప్పజెప్పునప్పుడు ----


ఊన షోడశవర్షో మే రామో రాజీవలోచనః. బాల. 20-2.


'నా రాముడు 16 ఏండ్లలోపలివాడు' అని అన్నాడు. అంటే అతడు 15 ఏండ్లవాడని స్పష్టమగుచున్నది. కాని ముందు అరణ్యకాండలో,