రామాయణ విశేషములు
71
10
ముందు ప్రకరణములో సీతారాముల వివాహము బాల్య వివాహమా ప్రౌఢవివాహమా అను విషయమును ఉభయత్ర అన్వయమగునటుల వర్ణించివేసినారు. సీతారామాదుల వివాహములు ప్రౌఢవయస్సుననే జరిగియుండును క్రీస్తు శకానంతరము బాల్యవివాహములు ప్రబలెను. సీతారాములకును బాల్యమందే పెండ్లియయ్యెనని యేబాల్యవివాహాభిమానియో ఆధారము కల్పింప జూచియుండును. అందేదైన ఒక పక్షము ప్రక్షిప్త మనక తప్పదు. అట్టి విషయములచర్చ ముందు చేయుచున్నాను.
అరణ్యకాండలో 56 సర్గ తర్వాత సీత కింద్రుడు ప్రత్యక్షమై పాయసము నిచ్చెనని 26 శ్లోకాల వర్ణన కలదు. ఆ భాగమంతయు ప్రక్షిప్తమేయని పలువు రంగీకరించినారు.
హనుమంతుడు సంస్కృతములో పార మందిన పండిత ప్రకాం డుడుగా వర్ణింపబడినాడు. అదంతయు ప్రక్షిప్త భాగమేయని నేను ముందు "సాంఘికాచారములు" అను ప్రకరణములో చర్చించినాను. ఇంకను ఇట్టి సంఘటనల నాయాతావులందు విమర్శింపగలను.
సి. వై. వైద్య అనువారు 'Riddle of the Ramayana' అను ఆంగ్ల గ్రంథములో రామాయణములోని ప్రక్షిప్తముల చర్చ అతివిపులముగా చేసినారు. అందుచేత నేనెక్కువగా దీనిని గురించి చర్చింపగోర లేదు. ఇందు నేను నాకు తోచిన వెత్తి చూపినాను.