68
రామాయణ విశేషములు
8
లక్ష్మణుని పెండ్లి అయ్యెనా ?
లక్ష్మణునికి పెండ్లి అయినట్లు అతని భార్యపేరు ఊర్మిళ అయి నట్లు బాలకాండలో ఇట్లు కలదు:
అబ్రవీత్ జనకో రాజా హర్షే ణాభిపరిప్లుతః
లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా.
బాల. 73 స. శ్లో. 70 నుండి.
ఈ శ్లోకాలు ప్రక్షిప్తములనియు లక్ష్మణునికి వివాహము కాలే
దనియు అనుమానము కలుగుచున్నది. ఈ అనుమానమును వాల్మీకి
రామాయణములోని ఇతర భాగాలు బలపరచుచున్నవి. ఎట్లనగా-
లక్ష్మణుడు 14 ఏండ్లు రామునితో వనవాసమునకై వెళ్ళినప్పుడు ఊర్మిళతో ఒక్కమాట ఆయినా చెప్పిపోయినట్టి జాడలేదు. రామాయణ ములో ఊర్మిళజాడ మరెందును స్పష్టముగా కానరాదు.
అరణ్యావాస కాలమందు శూర్పణఖ రాముని కామించి తనమనోరథ మును ప్రకటించుకొనగా రామభద్రు డిట్లనెను:
అనుజస్త్వేష మే భ్రాతా శీలవాన్ ప్రియదర్శనః,
శ్రీమాన కృతదారశ్చ లక్ష్మణోనామా వీర్యవాన్.
ఆరణ్య. స. 18 శ్లో. 3.
ఓ శూర్పణఖా, ఈ నా తమ్ముడగు లక్ష్మణుని లక్షణవంతుని
శ్రీమంతుని చక్కని వాని వరింపుము. ఇతడు పెండ్లికానివాడు. వీర్య
వంతుడు అని రాముడనెను. రాముడు శూర్పణఖతో సరసాలాడుచు